iDreamPost
android-app
ios-app

సెమీస్​కు ముందు భారత్​కు భారీ షాక్.. వరల్డ్‌ కప్​కు స్టార్ ప్లేయర్ దూరం!

  • Author singhj Published - 09:57 AM, Sat - 4 November 23

వరల్డ్ కప్-2023 సెమీస్​కు ముందు భారత క్రికెట్ టీమ్​కు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

వరల్డ్ కప్-2023 సెమీస్​కు ముందు భారత క్రికెట్ టీమ్​కు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

  • Author singhj Published - 09:57 AM, Sat - 4 November 23
సెమీస్​కు ముందు భారత్​కు భారీ షాక్.. వరల్డ్‌ కప్​కు స్టార్ ప్లేయర్ దూరం!

వన్డే వరల్డ్ కప్​లో భారత క్రికెట్ టీమ్ వరుస విజయాలతో పూర్తిగా డామినేట్ చేస్తోంది. ఇప్పటిదాకా మెగాటోర్నీలో ఆడిన ఏడుకు ఏడు మ్యాచుల్లోనూ టీమిండియా నెగ్గింది. వరుసగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్​తో పాటు శ్రీలంకను చిత్తు చేసింది. ప్రస్తుతం రోహిత్ సేన ఉన్న ఫామ్​ను బట్టి చూస్తే వరల్డ్ కప్ ట్రోఫీని చేతబట్టడం అంత కష్టం కాదేమోనని అనిపిస్తోంది. అన్ని విభాగాల్లోనూ ఫుల్ స్ట్రాంగ్​గా ఉన్న టీమిండియాతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు భయపడిపోతున్నారు. మన టీమ్​ను ఎలా ఫేస్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

శ్రీలంకపై విక్టరీతో సెమీఫైనల్ బెర్త్​ను టీమిండియా అధికారికంగా కన్ఫర్మ్ చేసుకుంది. దీంతో టోర్నీలో ఆడాల్సిన మిగిలిన రెండు మ్యాచులు నామమాత్రం కానున్నాయి. ఈ రెండు మ్యాచుల్లో నెగ్గినా, ఓడినా సెమీస్​పై ఎఫెక్ట్ పడదు. కాబట్టి బుమ్రా, కోహ్లీ, షమి లాంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చే యోచనలో టీమ్ మేనేజ్​మెంట్ ఉన్నట్లు సమాచారం. నెక్స్ట్ సౌతాఫ్రికా, నెదర్లాండ్స్​ మ్యాచ్​లను లైట్ తీసుకున్నా ముఖ్యమైన సెమీస్ కోసం మాత్రం రోహిత్, ద్రవిడ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ టైమ్​లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంజ్యురీ కారణంగా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా భారత టీమ్​కు దూరమయ్యాడు. ఈ వరల్డ్ కప్ నుంచి హార్దిక్ పూర్తిగా తప్పుకున్నాడు.

బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో బౌలింగ్ చేస్తూ గాయపడిన పాండ్యా బెంగళూరులోని ఎన్​సీఏకు వెళ్లాడు. అక్కడ ఇంజ్యురీ నుంచి కోలుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే అతడి ఎడమ కాలి పాదానికైన గాయం తగ్గేందుకు ఇంకా చాలా కాలం పడుతుందని.. అందుకే వరల్డ్ కప్ నుంచి హార్దిక్​ను పూర్తిగా పక్కన పెట్టారని సమాచారం. టీమ్ నుంచి తప్పుకున్న పాండ్యా ప్లేసులో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను రీప్లేస్ చేశామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కీలకమైన సెమీఫైనల్​కు పాండ్యా అందుబాటులో ఉండకపోవడం భారత్​కు బిగ్ షాక్ అనే చెప్పాలి. అతడు లేని లోటు బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​ పైనా పడనుంది. దీన్ని కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ ఎలా భర్తీ చేస్తారో చూడాలి. మరి.. హార్దిక్ వరల్డ్ కప్​కు దూరమవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్ శర్మకు కొత్త తలనొప్పి.. ఎలా పరిష్కరిస్తాడో?