iDreamPost

Hardik Pandya: హార్దిక్​ను కెప్టెన్ చేయడంతో ముంబైకి షాకిచ్చిన ఫ్యాన్స్.. ఇది అస్సలు ఊహించి ఉండరు!

  • Published Dec 16, 2023 | 10:50 AMUpdated Dec 16, 2023 | 2:12 PM

క్లబ్, ఫ్రాంచైజీ క్రికెట్​లో అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం కామన్ అని ముంబై ఇండియన్స్ మరోమారు ప్రూవ్ చేసింది. తమ టీమ్ కొత్త కెప్టెన్​గా హార్దిక్ పాండ్యాను నియమించింది. అయితే ఎంఐకి ఫ్యాన్స్ ఊహించని షాక్ ఇచ్చారు.

క్లబ్, ఫ్రాంచైజీ క్రికెట్​లో అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం కామన్ అని ముంబై ఇండియన్స్ మరోమారు ప్రూవ్ చేసింది. తమ టీమ్ కొత్త కెప్టెన్​గా హార్దిక్ పాండ్యాను నియమించింది. అయితే ఎంఐకి ఫ్యాన్స్ ఊహించని షాక్ ఇచ్చారు.

  • Published Dec 16, 2023 | 10:50 AMUpdated Dec 16, 2023 | 2:12 PM
Hardik Pandya: హార్దిక్​ను కెప్టెన్ చేయడంతో ముంబైకి షాకిచ్చిన ఫ్యాన్స్.. ఇది అస్సలు ఊహించి ఉండరు!

ఐపీఎల్​లో పాపులర్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పజెప్పింది. ఇటీవల జరిగిన ప్లేయర్ల రిటెన్షన్ టైమ్ నుంచే ముంబై కెప్టెన్సీ అంశం చర్చనీయాంశంగా మారింది. రిటెన్షన్​లో భాగంగా గుజరాత్ టైటాన్స్​ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను భారీ మొత్తం వెచ్చించి మరీ దక్కించుకుంది ముంబై. అయితే కెప్టెన్సీ ఇచ్చి తనను ఇంతగా ప్రోత్సహించిన గుజరాత్​ను హార్దిక్ ఎందుకు వీడాడో ఎవరికీ అర్థం కాలేదు. అదే టైమ్​లో టీమ్​కు ఒకసారి టైటిల్ అందించి, మరోమారు ఫైనల్స్​కు చేర్చిన పాండ్యాను టైటాన్స్ ఎందుకు వదులుకుందో కూడా మిస్టరీగా మారింది. దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. హార్దిక్​కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పే ఉద్దేశంతోనే ముంబై ఇంత రిస్క్ తీసుకుందని తేలిపోయింది. అయితే ఎంఐకి ఫ్యాన్స్ గట్టి షాక్ ఇచ్చారు.

హార్దిక్ పాండ్యాను కెప్టెన్​గా నియమించిందో లేదో ముంబై ఇండియన్స్​కు అభిమానులు షాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ నుంచి ఊహించని స్థాయిలో నిరసన సెగ తగిలింది. హార్దిక్​ను సారథిగా నియమిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ట్విట్టర్​లో 4 లక్షల మంది, ఇన్​స్టాగ్రామ్​లో 2 లక్షల మందికి పైగా ముంబైని అన్​ఫాలో చేశారు. ఈ దెబ్బతో ఎంఐ షాకవ్వగా.. ఇన్​స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీగా చెన్నై సూపర్ కింగ్స్ (13 మిలియన్లు) అవతరించింది. సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో ఫ్యాన్స్ నుంచి ఎంఐకి ఊహించని విధంగా వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కెప్టెన్సీ మార్పును వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు హిట్​మ్యాన్ అభిమానులైతే ముంబై జెర్సీలను తగులబెట్టారు. జెర్సీలను తగులబెట్టిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

mumbai indians captain hardik pandya

రోహిత్ శర్మ 2013 నుంచి 2023 వరకు ముంబై ఇండియన్స్​కు కెప్టెన్​గా ఉన్నాడు. అతడి సారథ్యంలోనే టీమ్ 5 సార్లు ఐపీఎల్​ టైటిల్​ను గెలుచుకుంది. అంతకుముందు సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ లాంటి గ్రేట్ క్రికెటర్స్ కెప్టెన్స్​గా ఉన్నప్పటికీ ముంబైకి కప్పు అందించలేకపోయారు. కానీ హిట్​మ్యాన్ ఏకంగా ఐదుసార్లు టీమ్​ను ఛాంపియన్​గా నిలిపాడు. అలాంటి రోహిత్​ను ఇలా హఠాత్తుగా కెప్టెన్సీ నుంచి తీసేయడం, తమ టీమ్ తమ ఇష్టం అన్నట్లుగా వ్యవహరించడాన్ని అభిమానులు సహించలేకపోతున్నారు. ఇది రోహిత్​ను అవమానించడమేనని సీరియస్ అవుతున్నారు. ముంబై ఇండియన్స్​ అకౌంట్స్​ను చాలా మంది అన్​ఫాలో చేస్తున్నారు. రోహిత్ ఫ్యాన్స్ నుంచి అసంతృప్తిని ఎక్స్​పెక్ట్‌ చేసినా.. ఇంత స్థాయిలో వ్యతిరేకతను మాత్రం ముంబై ఊహించి ఉండకపోవచ్చు. మరి.. ముంబైకి ఫ్యాన్స్ షాక్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Suryakumar Yadav: వీడియో: పేసర్ అర్ష్​దీప్​కు వార్నింగ్ ఇచ్చిన సూర్యకుమార్.. వేలు చూపిస్తూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి