iDreamPost

వీడియో: డ్రెస్సింగ్ రూమ్​లో హార్దిక్ స్పీచ్.. ఒక్క నవ్వుతో పరువు తీసేసిన బుమ్రా!

  • Published Apr 04, 2024 | 12:09 PMUpdated Apr 04, 2024 | 12:38 PM

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అడ్డంగా దొరికాడు. డ్రెస్సింగ్ రూమ్ స్పీచ్​ కోసం అతడు చేసిన పనితో మరోసారి ట్రోలింగ్​కు గురవుతున్నాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అడ్డంగా దొరికాడు. డ్రెస్సింగ్ రూమ్ స్పీచ్​ కోసం అతడు చేసిన పనితో మరోసారి ట్రోలింగ్​కు గురవుతున్నాడు.

  • Published Apr 04, 2024 | 12:09 PMUpdated Apr 04, 2024 | 12:38 PM
వీడియో: డ్రెస్సింగ్ రూమ్​లో హార్దిక్ స్పీచ్.. ఒక్క నవ్వుతో పరువు తీసేసిన బుమ్రా!

ఐపీఎల్-2024 ఫేవరెట్స్​లో ఒకటిగా ముంబై ఇండియన్స్​ను చెబుతూ వచ్చారు. కానీ ఆ టీమ్ అంచనాలకు తగ్గట్లుగా సీజన్​ను స్టార్ట్ చేయలేదు. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడింది. హ్యాట్రిక్ ఓటములతో అభిమానులను పూర్తిగా నిరాశపర్చింది. ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ తేలిపోతోంది. రాజస్థాన్ రాయల్స్​తో మ్యాచ్​లోనైతే 125 పరుగులకే ఆలౌట్ అయింది ఎంఐ. అది కూడా తమ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడేలో. ఆ టీమ్ బౌలింగ్ యూనిట్ కూడా దారుణంగా పెర్ఫార్మ్ చేస్తోంది. దీంతో ముంబై తీవ్రంగా విమర్శల పాలవుతోంది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విమర్శకులు వదలడం లేదు. పాండ్యా ఫెయిల్యూరే ఎంఐకి బిగ్ మైనస్​గా మారిందని అంటున్నారు. ఈ తరుణంలో కాపీ వివాదంతో మరోమారు ట్రోలింగ్​కు గురవుతున్నాడు హార్దిక్.

కెప్టెన్సీ మార్పు అంశంలో రోహిత్ శర్మ ఫ్యాన్స్​తో పాటు చాలా మంది ముంబై ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యా మీద సీరియస్​గా ఉన్నారు. అందుకే మొదటి మ్యాచ్ నుంచి అతడ్ని టార్గెట్ చేసుకొని ఏడిపిస్తున్నారు. పాండ్యాను ఎగతాళి చేయడం, అవమానిస్తుండటం మ్యాచ్​ల టైమ్​లో చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో ముంబై కొత్త కెప్టెన్ మరోమారు అడ్డంగా దొరికాడు. డ్రెస్సింగ్ రూమ్​లో ఇచ్చిన స్పీచ్​ను అతడు ఓ మూవీ నుంచి కాపీ కొట్టడంతో అందరూ ట్రోల్ చేస్తున్నారు. పాండ్యా నువ్విక మారవా అంటూ విమర్శిస్తున్నారు. సన్​రైజర్స్​ హైదరాబాద్​పై మ్యాచ్​లో ఓడిన తర్వాత ఎంఐ డ్రెస్సింగ్ రూమ్​లో హార్దిక్ ఓ స్పీచ్ ఇచ్చాడు. మనది చాలా టఫ్​ టీమ్ అని.. కఠినమైన జట్లకే కఠినమైన సవాళ్లు ఎదురవుతాయని అన్నాడు.

ముంబై బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా పోరాడారని.. ఆటగాళ్ల విషయంలో తనకు గర్వంగా ఉందని స్పీచ్​లో పాండ్యా చెప్పాడు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ టోర్నీలో ముందుకెళ్దామని పేర్కొన్నాడు. మంచి, చెడు ఏది జరిగినా కలసికట్టుగా పోరాడదామని పాండ్యా స్పీచ్​లో చెప్పడం చూడొచ్చు. హార్దిక్ స్పీచ్ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. అతడ్ని అవమానిస్తున్న వారు కూడా ఆ స్పీచ్ చూసి మెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ స్పీచ్ రియల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో షాక్ అయ్యారు. స్పీచ్​ కోసం ఓ మూవీలోని డైలాగ్స్​ను అతడు వాడినట్లు తేలింది. ఆ సినిమాలోని ఒరిజినల్ స్పీచ్ వీడియోతో పాటు పక్కనే పాండ్యా స్పీచ్ పెట్టి నెట్టింట కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో హార్దిక్ కాపీ కొట్టాడని తేలిపోయింది. అంతే నెటిజన్స్ ఎంఐ కెప్టెన్​ను ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్సీనే అనుకున్నాం.. స్పీచ్ ఇవ్వడం కూడా చేతకాదా? అని విమర్శిస్తున్నారు. మరికొందరేమో పాండ్యా కాపీ స్పీచ్​ను బుమ్రా ముందే పట్టేశాడని.. అందుకే డ్రెస్సింగ్ రూమ్​లో నవ్వుతూ కనిపించాడని అంటున్నారు. మరి.. పాండ్యా స్పీచ్ వివాదంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: KKR వరుస విజయాల వెనుక కోహ్లీ.. ఆ ఒక్క సీన్​తో మారిన జట్టు రాత!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి