iDreamPost

KKR వరుస విజయాల వెనుక కోహ్లీ.. ఆ ఒక్క సీన్​తో మారిన జట్టు రాత!

  • Published Apr 04, 2024 | 10:19 AMUpdated Apr 04, 2024 | 10:19 AM

కోల్​కతా నైడ్ రైడర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే ఆ టీమ్ హ్యాట్రిక్ విక్టరీస్ వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడు. కేకేఆర్ విజయాలకు, కోహ్లీకి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కోల్​కతా నైడ్ రైడర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే ఆ టీమ్ హ్యాట్రిక్ విక్టరీస్ వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడు. కేకేఆర్ విజయాలకు, కోహ్లీకి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 04, 2024 | 10:19 AMUpdated Apr 04, 2024 | 10:19 AM
KKR వరుస విజయాల వెనుక కోహ్లీ.. ఆ ఒక్క సీన్​తో మారిన జట్టు రాత!

కోల్​కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్-2024లో వరుస విజయాలతో ఫుల్ జోష్​లో ఉంది. బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తోంది కేకేఆర్. తొలి రెండు మ్యాచుల్లో సన్​రైజర్స్​ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించిన అయ్యర్ సేన.. మూడో మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్​ను 106 పరుగుల తేడాతో చిత్తు చేసి హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. ఆడిన తొలి మూడు మ్యాచుల్లో నెగ్గడం ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో కేకేఆర్​కు ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, సునీల్ నరైన్ బ్యాటింగ్ విధ్వంసం, ఆండ్రీ రస్సెల్ ఆల్​రౌండ్ షో, బౌలర్ల సమష్టి కృషి వల్లే కోల్​కతా అప్రతిహత విజయాలతో దూసుకుపోతోందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఆ టీమ్ సక్సెస్​ వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడు. అసలు కోల్​కతాకు కోహ్లీకి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం..

గత సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్​ మెంటార్​గా ఉన్న లెజెండ్ గౌతం గంభీర్ ఈసారి కోల్​కతాకు మారాడు. అతడి రాకతో టీమ్ రాతే మారిపోయింది. వరుస విజయాలతో దూకుడు మీద ఉంది కేకేఆర్. సునీల్ నరైన్​ను ఓపెనర్​గా పంపడం సక్సెస్ అయింది. నరైన్ సంచలన ఇన్నింగ్స్​లతో చెలరేగుతున్నాడు. మిగతా ఆటగాళ్లలోని టాలెంట్​ను కూడా బయటకు తీస్తూ కేకేఆర్ విజయాల్లో కీలకంగా మారాడు గౌతీ. అయితే ఆ టీమ్ ఫేట్ పూర్తిగా ఛేంజ్ అవడానికి మాత్రం కోహ్లీనే కారణం. ఐపీఎల్-2023లో ఆర్సీబీ-ఎల్​ఎస్​జీ మ్యాచ్​లో విరాట్​కు గంభీర్​కు మధ్య గొడవైన సంగతి తెలిసిందే. ఆ టైమ్​లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు గౌతీ. తన తప్పు లేకపోయినా అవమానించారని అతడు ఫీలయ్యాడు. ఆ సమయం​లో లక్నో ఫ్రాంచైజీ నుంచి అతడికి సపోర్ట్ లేకుండా పోయింది.

Kohli behind KKR's consecutive wins!

గంభీర్​కు అండగా నిలవాల్సిన ఎల్​ఎస్​జీ విరాట్ కోహ్లీని పొగుడుతూ తర్వాత ట్వీట్స్ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు గౌతీ. లక్నో ఫ్రాంచైజీలో అతడు ఉండలేకపోయాడు. అదే సమయంలో కోల్​కతా నైట్ రైడర్స్ నుంచి పిలుపు వచ్చింది. కెప్టెన్​గా ఉన్నప్పుడు టీమ్​కు కప్పు అందించిన గౌతీని తిరిగి ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాడు కింగ్ ఖాన్ షారుక్. దీంతో కేకేఆర్​తో చేరిన గంభీర్.. ఇప్పుడు ఆ కసిని అంతా టీమ్​లోకి నూరి పోశాడు. ఎవరైతే కోహ్లీ కోసం తనను తిట్టారో వాళ్లంతా ఇప్పుడు గంభీర్​ను పొగుడుతున్నారు. ఈ విజయాలు అన్నింటికీ కారణం విరాట్ మీద కోపమేనని చెప్పకతప్పదు. ఒక్క గొడవతో గంభీర్ ఎల్​ఎస్​జీని వీడి కేకేఆర్​లోకి రావడం, కసితో టీమ్​ను ముందుకు నడపడం వల్లే ఈ విక్టరీలు సాధ్యం అయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: పంత్ కళ్లుచెదిరే సిక్సర్.. బిత్తరపోయిన షారుక్ ఖాన్​!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి