iDreamPost

OTTలోకి బెస్ట్ హారర్‌ మూవీ.. ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి ప్లీజ్!

  • Published Mar 28, 2024 | 5:19 PMUpdated Mar 28, 2024 | 5:19 PM

ఓటీటీలో ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో సైలెంట్ గా కొన్ని సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. తాజాగా హన్సిక నటించిన ఓ హర్రర్ కమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీలో ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో సైలెంట్ గా కొన్ని సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. తాజాగా హన్సిక నటించిన ఓ హర్రర్ కమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 28, 2024 | 5:19 PMUpdated Mar 28, 2024 | 5:19 PM
OTTలోకి  బెస్ట్ హారర్‌ మూవీ.. ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి ప్లీజ్!

ఓటీటీ సినిమాల హావ రోజు రోజుకు పెరిగిపోతుంది. థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు కొన్నైతే, డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యే సినిమాలు మరికొన్ని.. ఈ క్రమంలో చాలా వరకు సినిమాలన్నీ కూడా ఎలాంటి ప్రకటనలు లేకుండా ఓటీటీలో ప్రసారం అవ్వట్లేదు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం చడీ చప్పుడు లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా హన్సిక నటించిన ఓ క్రైమ్ అండ్ హర్రర్ థ్రిల్లర్ “105 మినిట్స్” సినిమా సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 26న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

ఈ మధ్య కాలంలో హన్సిక వెండి తెరపై అంతగా కనిపించడం లేదని చెప్పి తీరాలి. ఈ అమ్మడికి అందం, నటనలో ప్రావిణ్యం ఉన్నా కూడా .. ఎందుకో సినిమాలు మాత్రం సరిగా అచ్చి రావడం లేదు. ఇక పెళ్లి తర్వాత హన్సిక డిఫరెంట్ కాన్సెప్ట్స్ నే ఎంచుకుంటుంది. ఈ క్రమంలోనే హన్సిక ప్రధాన పాత్రలో నటించిన .. సినిమా “105 మినిట్స్”. ఈ సినిమాకు రాజు దుస్సా దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా అంతా కూడా కేవలం హన్సిక మాత్రమే కనిపించడం విశేషం. పైగా 34 నిమిషాల గల ఓ షాట్ ను హన్సిక కేవలం ఒకే టేక్ లో పూర్తి చేసిందట. ఇలా ఎన్నో సన్నివేశాలను హన్సిక చాలా సులువుగా నటించేసిందట. ఇక ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఓటీటీ ప్రేక్షకులను ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

“105 మినిట్స్” సినిమా కథ విషయానికొస్తే.. ఓ రోజు హన్సిక ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో.. దారిలో ఎవరో తనను వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది. అలానే ఇంటికి చేరుకున్న తర్వాత భారీ వర్షం కారణంగా .. పవర్ కట్ అవుతుంది. తన వెంటే వచ్చిన ఓ అదృశ్య శక్తి ఎదో.. తనని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆమెను ఇనుప జువ్వలతో బంధించి చిత్ర హింసలు పెడుతుంది. ఆ అదృశ్య శక్తి మరణానికి కారణం హన్సికనే అంటూ.. ఆమెను భయపెడుతుంది. మరి నిజంగానే హన్సికకు .. ఆ అదృశ్య వ్యక్తి మరణానికి సంబంధం ఉందా! అసలు ఆ అదృశ్య శక్తి హన్సికను ఎందుకు వెంబడించింది! అనే ప్రశ్నలకు సమాధానం తెల్సుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి, 105మినిట్స్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి