iDreamPost

అత్తను చంపిన అల్లుడి కేసులో షాకింగ్ ట్విస్ట్!

అత్తను చంపిన అల్లుడి కేసులో షాకింగ్ ట్విస్ట్!

హనుమకొండలో కానిస్టేబుల్ ప్రసాద్ అనే వ్యక్తి తన సొంత అత్తను రివాల్వర్ తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ నిందితుడు ప్రసాద్ ను ఆస్పత్రికి తరలించారు. ఇంతే కాకుండా మృతదేహాన్ని సైతం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలోని ఇందిరమ్మ కాలనీలో కమలమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమె కూతురు రమాదేవిని ప్రసాద్ కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కూతుళ్ల సంతానం. ఇతడు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రసాద్ గతంలో తన అత్త కమలమ్మకు రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ మహిళ నెలనెల వడ్డీ చెల్లిస్తూనే ఉంది. ఇటీవల డబ్బులు మొత్తం కావాలని ప్రసాద్ అడగడంతో ఇల్లు అమ్మి ఇస్తానని కమలమ్మ చెప్పింది.

కాగా, ఇదే విషయంపై అత్త, అల్లుడి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రసాద్ తన స్టేషన్ లో ఎస్సై రివాల్వర్ ను దొంగిలించి గురువారం ఉదయం హనుమకొండలోని అత్తింటికి వచ్చాడు. ఇక వస్తు వస్తూనే అక్కడే ఉన్న తన భార్య, అత్త కమలమ్మతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే ప్రసాద్ తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ తో అత్త కమలమ్మపై కాల్పులు జరిపాడు. భార్యను కూడా హత్య చేయాలని చూసే లోపే స్థానికులు వచ్చి అతడి చేతిలో ఉన్న రివాల్వర్ ను లాక్కుని అతడిపై దాడికి దిగారు.

తల్లి మృతి చెందడంతో ప్రసాద్ భార్య రమాదేవి గుండెలు పగిలేలా ఏడ్చింది. గ్రామస్తులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ ప్రసాద్ ను ఎంజీఎంకు తరలించారు. ఆ తర్వాత కమలమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ కాల్పుల ఘటనపై డీసీపీ సైతం స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి