iDreamPost
android-app
ios-app

అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు

  • Published Oct 12, 2023 | 3:37 PM Updated Updated Oct 12, 2023 | 3:37 PM
  • Published Oct 12, 2023 | 3:37 PMUpdated Oct 12, 2023 | 3:37 PM
అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు

కుటుంబ కలహాలు, ఆస్థి తగాదాల కారణంగా రక్త సంబంధీకులను పొట్టనబెట్టుకుంటున్నారు. వారిపై కక్షను పెంచుకుని, ఉద్దేశపూర్వకంగా చంపేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే హన్మకొండలో చోటుచేసుకుంది. కుటుంబ గొడవలు, ఆర్థికపరమైన ఘర్షణ మూలంగా పిల్లనిచ్చిన అత్తనే దారుణంగా హతమార్చాడో కానిస్టేబుల్. గుండ్ల సింగారం ఇందిరమ్మ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. డబ్బుల విషయంలో అత్తా, అల్లుళ్ల మధ్య గొడవలు జరిగి.. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళితే.. గుండ్ల సింగారానికి చెందిన కమల.. తన కుమార్తె రమను.. ప్రసాద్ అనే కానిస్టేబుల్‌కు ఇచ్చి వివాహం చేసింది. రామగుండం పోలీస్ కమిషనరేటు పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది.

కానీ కొన్ని రోజుల నుండి ప్రసాద్ మద్యానికి బానిసై.. భార్య రమతో గొడవ పడుతున్నాడు. దీంతో అతడిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటుంది. కాగా, ప్రసాద్.. తన అత్తకు గతంలో రూ. 4 లక్షలు అప్పుగా ఇవ్వడంతో.. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలంటూ అడగటం మొదలు పెట్టాడు. బుధవారం కూడా ఆమె ఇంటికి వచ్చి.. డబ్బులు విషయమై ఆమెను ప్రశ్నించాడు. అత్త, అల్లుడు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన ప్రసాద్.. తన వెంట తెచ్చుకున్న సర్వీస్ రివాల్వర్‌తో అత్త కమలపై కాల్పలుకు తెగబ్డడాడు. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనతో ఒక్కసారిగా ఉలికిపడ్డ జనం.. వెంటనే తేరుకుని ప్రసాద్‌ను పట్టుకుని చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేసి.. విచారిస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibom