iDreamPost

తలైవా షూటింగ్‌లో గాయపడ్డ గురు హీరోయిన్

సినీ ఇండస్ట్రీలోకి ఫ్యాషన్ తో వచ్చినా.. అది ఎప్పుడు ఎవరినీ నిలబెడుతుందో, ఎప్పుడు పడగొడుతుందో తెలియదు. ఈ భయంతోనే.. సినీ కెరీర్ తక్కువ ఉంటే నటీమణులు.. దీనిపైన మాత్రమే ఆశలు పెట్టుకోవడం లేదు. చదువు, ఇతర రంగాల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. అటువంటి వారిలో..

సినీ ఇండస్ట్రీలోకి ఫ్యాషన్ తో వచ్చినా.. అది ఎప్పుడు ఎవరినీ నిలబెడుతుందో, ఎప్పుడు పడగొడుతుందో తెలియదు. ఈ భయంతోనే.. సినీ కెరీర్ తక్కువ ఉంటే నటీమణులు.. దీనిపైన మాత్రమే ఆశలు పెట్టుకోవడం లేదు. చదువు, ఇతర రంగాల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. అటువంటి వారిలో..

తలైవా షూటింగ్‌లో గాయపడ్డ గురు హీరోయిన్

ఒకప్పుడు హీరోయిన్లు డాక్టర్ కాబోయి యాక్టర్ అవుతున్నామని చెబుతుండే వాళ్లు. కానీ నేటి భామలు మాత్రం.. చదువుకు ప్రాధాన్యతనిస్తూనే కెరీర్ పై దృష్టి సారిస్తున్నారు. అలాంటి వారిలో ఈ నటి కూడా ఒకరు. క్రీడా రంగంలో నుండి మూవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె ఎవరో కాదూ రితిక సింగ్. వెంకటేష్ గురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అలాగే ఆది పినిశెట్టితో కలిసి నీవెవరో అనే చిత్రంలో కనిపించింది. తెలుగులో రితిక క్లిక్ కాలేకపోయింది. తమిళంలో వరుస పెట్టి మూవీస్ చేస్తోంది. ఇటీవల కింగ్ ఆఫ్ కొత్త మూవీలో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. తాజాగా ఆమె కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. తలైవర్ 170 సినిమాలో నటిస్తోంది రతిక.

ఈ మూవీ షూటింగ్‌లో రతిక గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆమె చేతిపై పలు చోట్ల రక్తపు గాయాలు కనిపిస్తున్నాయి. షూటింగ్ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ చెబుతూనే ఉన్నాడట. అది గ్లాస్.. కాస్త జాగ్రత్తగా ఉండమని, కానీ అనుకోకుండా ప్రమాదం జరిగిందని వెల్లడించింది. గాజు గీసుకుకపోవడం వల్లే గాయపడినట్లు పేర్కొంది. కొన్ని సార్లు క్షణాల్లో జరిగిపోయ వాటిని మనం ఆపలేమని, ప్రస్తుతం అయితే తనకు నొప్పి అనిపించడం లేదని పేర్కొంది. అయితే తన శరీరాన్ని గాయపర్చిందని తెలిపింది. ఆసుపత్రికి వెళ్లి.. చికిత్స తీసుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు చెప్పింది. ఇది ఓ ఫైట్ సీన్ సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లోనే బిజీ బిజీగా గడుపుతోంది ఈ మాజీ బాక్సర్. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిన సాలా కద్దూస్/ఇరుది షుట్రు మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ భామ. గురు, శివలింగ, ఓమై కడవలే వంటి చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇన్ కార్ అనే హందీ మూవీలో కూడా కనిపించింది. ఇలా క్రీడా రంగం నుండి ఇండస్ట్రీలోకి వచ్చి దూసుకెళుతోంది ఈ చిన్నది. కానీ తెలుగు పరిశ్రమలో కనిపించడం లేదు. మరీ ఈ కోమలిని కోలీవుడ్ గుర్తించింది కానీ టాలీవుడ్ మాత్రం ఇంకా గుర్తించాల్సి ఉంది. దీనికి కాలమే సమాధానం చెబుతుందేమో. ఆమె మూవీస్ లో మీకు ఏ సినిమా నచ్చుతుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి