iDreamPost
android-app
ios-app

సీమా హైదర్ ఒక దొంగ.. ఉరికంబం ఎక్కిస్తా: పాకిస్థాన్ భర్త

ప్రియుడి కోసం పిల్లలను తీసుకుని పాక్ నుంచి భారత్ కు వచ్చిన సీమా హైదర్ వ్యవహారం దేశంలో సంచలనం సృష్టించింది. అయితే తన భర్త గులాం హైదర్ సీమాపై సంచలన కామెంట్స్ చేశాడు.

ప్రియుడి కోసం పిల్లలను తీసుకుని పాక్ నుంచి భారత్ కు వచ్చిన సీమా హైదర్ వ్యవహారం దేశంలో సంచలనం సృష్టించింది. అయితే తన భర్త గులాం హైదర్ సీమాపై సంచలన కామెంట్స్ చేశాడు.

సీమా హైదర్ ఒక దొంగ.. ఉరికంబం ఎక్కిస్తా: పాకిస్థాన్ భర్త

గతేడాది దేశంలో సంచలనం రేపిన అంశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ ప్రియుడి కోసం భారత్ కు రావడమే. నలుగురు పిల్లల తల్లైన సీమా హైదర్ తన ప్రియుడి కోసం భర్తను వదిలి భారత్ కు చేరింది. యూపీకి చెందిన సచిన్ మీనాతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఆతర్వాత ప్రేమగా మారి పిల్లలతో కలిసి సచిన్ చెంతకు చేరింది. అప్పటి నుంచి సీమా హైదర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక పాక్ లో ఉన్న తన భర్త గులాం హైదర్ పిల్లలను అక్రమంగా తీసుకెళ్లిందంటూ సీమాహైదర్ పై తీవ్ర విమర్శలు చేశాడు. సీమా హైదర్ ఒక దొంగ ఆమెను ఉరికంబం ఎక్కిస్తానంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

సీమాహైదర్ భారత్ కు చేరిన తర్వాత తనను పాక్ కు తిరిగి రావాలని కోరినప్పుడు చావనైనా చస్తాను గానీ సచిన్ ను వదిలి రాను అని ఖరాకండిగా చెప్పిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి గులాం హైదర్ తన భార్య సీమా హైదర్‌ను, పిల్లలను తిరిగి వెనక్కి పంపాలని సోషల్ మీడియా ద్వారా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాడు. గులాం హైదర్ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించుకొని సీమాహైదర్ వ్యవహారం ఇరు దేశాల ప్రజలకు తెలిసేలా వీడియోల రూపంలో వ్యక్త పరుస్తున్నాడు. ఇటీవల గులాం హైదర్ కు చెందిన వీడియో ఒకటి నెట్టింటా వైరల్ గా మారింది. ఆ వీడియోలో తన భార్యా పిల్లలను పాక్ కు పంపించాలని భారత్ ను కోరాడు.

త్వరలోనే భారత్ కు వస్తానని తన పిల్లలను తీసుకెళ్తానని వెల్లడించాడు. భారత చట్టాలపై నాకు నమ్మకం ఉందని తప్ప కుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు సీమా హైదర్ తరపు న్యాయవాది ఏపీ సింగ్, నేత్రపాల్‌లను గులాం హైదర్‌ హెచ్చరించాడు. ఈ క్రమంలోనే గులాం హైదర్ సీమాహైదర్ పై తీవ్రమైన ఆరోపణలు గుప్పించాడు. సీమా హైదర్ ఒక దొంగ, నేరస్తురాలు. నా ఆస్తులు అమ్ముకుని భారత్ కు పారిపోయిందని అన్నాడు. ఏదో ఒక రోజు నేను నిన్ను ఉరికంబం ఎక్కిస్తానని ఆ వీడియోలో గులాం హైదర్ వెల్లడించాడు. ఆమెతో పాటు ప్రియుడు సచిన్ మీనాను కూడా హెచ్చరించాడు. మీరు చేసిన తప్పులకు ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదంటూ తెలిపాడు. మరి సీమాహైదర్ పై తన భర్త గులాం హైదర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş