iDreamPost
android-app
ios-app

Shubman Gill: 89 రన్స్ కాపాడుకోవాలంటే.. ఆ ఒక్క అద్భుతం జరగాలి: గిల్

  • Published Apr 18, 2024 | 9:14 AM Updated Updated Apr 18, 2024 | 9:14 AM

89 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ఆ ఒక్క అద్భుతమే జరగాలని, లేకపోతే గెలవడం కష్టమని గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ పేర్కొన్నాడు. ఇంతకీ ఆ అద్భుతం ఏంటంటే?

89 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ఆ ఒక్క అద్భుతమే జరగాలని, లేకపోతే గెలవడం కష్టమని గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ పేర్కొన్నాడు. ఇంతకీ ఆ అద్భుతం ఏంటంటే?

Shubman Gill: 89 రన్స్ కాపాడుకోవాలంటే.. ఆ ఒక్క అద్భుతం జరగాలి: గిల్

గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు ఐపీఎల్ సీజన్లలో ఓసారి ఛాంపియన్ గా నిలవడంతో పాటుగా మరోసారి రన్నరప్ గా నిలిచి అందరి ఆకట్టుకుంది. ఇక అదే జోరును ఈ ఐపీఎల్ లోనూ చూపించాలనుకున్న గుజరాత్ కు టోర్నీ ఆరంభంలోనే హార్దిక్ పాండ్యా వెళ్లిపోవడంతో భారీ షాక్ తగిలింది. అయినప్పటికీ ప్రారంభ మ్యాచ్ ల్లో గెలిచి.. అందరి అంచనాలను తలకిందులు చేసింది. అయితే ఏమైందో ఏమోకానీ.. ప్రస్తుతం పరాజయాల వైపు పయనిస్తోంది గిల్ టీమ్. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక తమ ఓటమికి కారణాలు చెబుతూ.. ఆ ఒక్క అద్భుతం జరిగితే తప్ప 89 పరుగులను కాపాడుకోవడం అసాధ్యం అంటూ కెప్టెన్ శుబ్ మన్ గిల్ పేర్కొన్నాడు.

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది గుజరాత్ టీమ్. అయితే బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పాటుగా కంటిన్యూస్ గా వికెట్లు తీస్తూ.. గుజరాత్ ను దెబ్బకొట్టారు. ఢిల్లీ బౌలర్లు ముకేశ్ కుమార్ 3,ట్రిస్టన్ స్టబ్స్ 2, ఇషాంత్ 2 వికెట్లు తీయడంతో.. గుజరాత్ 17.3 ఓవర్లలో కేవలం 89 రన్స్ కే కుప్పకూలింది. రషీద్ ఖాన్ ఒక్కడే 31 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం 90 లక్ష్యంతో బరిలోకి దిగిన డీసీ టీమ్ 8.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించిది. ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం ఓటమి గురించి మాట్లాడాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్ మన్ గిల్.

Shubman Gill's response on defending 89

“ఈ మ్యాచ్ లో మా బ్యాటింగ్ బాలేదు. ఇక నాతో పాటుగా సాహా, సాయి సుదర్శన్ అవుటైన తీరు చూస్తే.. పిచ్ వల్ల వికెట్లు కోల్పోలేదని స్పష్టమవుతుంది. అయితే మేం ప్రత్యర్థి ముందు ఉంచిన లక్ష్యం చాలా చిన్నది. 89 పరుగులను కాపాడుకోవాలంటే.. మా బౌలర్లు డబుల్ హ్యాట్రిక్ సాధించాల్సి ఉంటుంది. ఇక ఈ ఓటమిని మరచిపోయి, వచ్చే మ్యాచ్ కు బలంగా రెడీ అవ్వడానికి ప్రయత్నిస్తాం. ఈ ఓటమితో మా ప్లేఆఫ్ అవకాశాలు ఏమీ కోల్పోలేదు. అక్కడికి చేరుకునే ఛాన్స్ లు మాకు మెరుగ్గానే ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు శుబ్ మన్ గిల్. మరి డబుల్ హ్యాట్రిక్ సాధిస్తే గెలుస్తామన్న గిల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.