iDreamPost

DKతో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు దేశమంతా మాట్లాడుకునే క్రికెటర్!

Guess This Young Cricketer With Dinesh Karthik: ఈ ఫొటోలో దినేశ్ కార్తీక్ నుంచి సైకిల్ ను ప్రైజ్ గా తీసుకుంటున్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇండియా మొత్తం ఇతని పేరు బాగా వైరల్ అవుతోంది.

Guess This Young Cricketer With Dinesh Karthik: ఈ ఫొటోలో దినేశ్ కార్తీక్ నుంచి సైకిల్ ను ప్రైజ్ గా తీసుకుంటున్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇండియా మొత్తం ఇతని పేరు బాగా వైరల్ అవుతోంది.

DKతో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు దేశమంతా మాట్లాడుకునే క్రికెటర్!

దినేశ్ కార్తీక్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పోరాటం ముగిసిన రోజే.. డీకే తన ప్రయాణానికి కూడా వీడ్కోలు చెప్పేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించాలి అనుకున్నట్లు ఉన్నాడు. కానీ, ఆర్సీబీ జట్టు రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఈ విషయాన్ని చెప్పేశాడు. అయితే ప్రస్తుతం డీకేతో ఉన్న ఓ కుర్రాడి పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. అందరూ దినేశ్ కార్తీక్ కి విషెస్ చెప్పినట్లు ఈ యంగ్ క్రికెటర్ కూడా చెప్పాడు. ఎవరో గుర్తు పట్టారా?

దినేశ్ కార్తీక తన క్రికెట్ ప్రయాణాన్ని దాదాపుగా ముగించినట్లే. నెక్ట్స్ సీజన్ నుంచి దినేశ్ కార్తీక్ ని కొత్త అవతారంలో చూసే అవకాశం లేకపోలేదు. డీకే వచ్చే ఐపీఎల్ లో కామెంటేటర్ అవతారం ఎత్తినా ఆశ్యర్య పోవాల్సిన అవసరం లేదు. అలాగే ఆర్సీబీ జట్టుకు సపోర్టింగ్ స్టాఫ్ లోకి దినేశ్ కార్తీక్ ఎంట్రీ ఇచ్చినా ఇస్తాడు. అయితే రిటైర్ అయిన తర్వాత దినేశ్ కార్తీక్ కు ఎంతో మంది లెజెండ్స్ విషెస్ చెప్పారు. అలాగే ఈ యంగ్ క్రికెటర్ కూడా దినేశ్ కార్తీక్ తన క్రికెట్ ప్రయాణాన్న ముగించిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాడు. ఆ సందర్భంలో డీకేతో తనకు ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కొన్ని పిక్స్ ని పోస్ట్ చేశాడు.

ఈ యంగ్ క్రికెటర్ పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతా దినేశ్ పిక్స్ పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్తే.. ఈ క్రికెటర్ మాత్రం డీకేతో తనకు ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ క్రికెటర్ ని గుర్తు పట్టారా? ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ క్రికెటర్ గురించే చర్చ జరుగుతోంది. అంబటి రాయుడు కూడా ఇతని విషయంలోనే ఇన్ డైరెక్ట్ గా తన అక్కసు తీర్చుకుంటున్నాడు. ఏంటి గుర్తు పట్టారా? ఆ కుర్రాడు మరెవరో కాదు.. విజయ్ శంకర్. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అంబటి రాయుడు, విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్ పేర్లే వైరల్ అవుతున్నాయి.

దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా అతని పేరు వార్తల్లో నిలిచింది. కానీ, అంబటి రాయుడు చేస్తున్న వరుస పోస్టుల నేపథ్యంలో అటు విరాట్ కోహ్లీ పేరు, ఇటు విజయ్ శంకర్ వైరల్ అవుతున్నారు. 2019 వరల్డ్ కప్ స్క్వాడ్ లో విజయ్ శంకర్ చోటు దక్కించుకున్నాడు. కానీ, అంబటి రాయుడుకి చోటు లేదు. ఆ సమయంలో రాయుడు త్రీడీ గ్లాసెస్ అంటూ ఒక పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ అక్కసును ఇప్పటికీ ఆర్సీబీ మీద వరుస పోస్టులతో తీర్చుకుంటూనే ఉన్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విజయ్ శంకర్ కూడా వార్తల్లో నిలుస్తున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి