iDreamPost

Pic Talk: ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని గుర్తుపట్టారా! ఇప్పుడు హీరోగా ఇండియాని ఊపేస్తున్నాడు..

  • Published Apr 08, 2024 | 4:10 PMUpdated Apr 08, 2024 | 4:10 PM

సోషల్ మీడియాలో స్టార్స్ చైల్డ్ హుడ్ పిక్స్ ట్రెండ్ లోకి మరొక బుడతడి ఫోటో వచ్చేసింది. మరి ఆ బుడతడు ఎవరో ఇప్పుడు ఎలా ఉన్నాడో.. ఏం చేస్తున్నాడో గెస్ చేసేద్దాం.

సోషల్ మీడియాలో స్టార్స్ చైల్డ్ హుడ్ పిక్స్ ట్రెండ్ లోకి మరొక బుడతడి ఫోటో వచ్చేసింది. మరి ఆ బుడతడు ఎవరో ఇప్పుడు ఎలా ఉన్నాడో.. ఏం చేస్తున్నాడో గెస్ చేసేద్దాం.

  • Published Apr 08, 2024 | 4:10 PMUpdated Apr 08, 2024 | 4:10 PM
Pic Talk: ఈ ఫోటోలో ఉన్న  బుడ్డోడిని గుర్తుపట్టారా! ఇప్పుడు  హీరోగా ఇండియాని ఊపేస్తున్నాడు..

చిన్ననాటి ఫొటోస్ ను గెస్ చేయడంలో ఇప్పుడు అందరూ చాలా ఆశక్తి కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా స్టార్ సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోస్ ట్రెండ్ అవుతూనే ఉన్నా కూడా.. ఈ మధ్య కాలంలో వీటికి క్రేజ్ బాగా పెరిగిందని చెప్పి తీరాలి. ఈ క్రమంలో ఒకరు ఇద్దరు కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో మంది స్టార్ సెలెబ్రిటీల చైల్డ్ హుడ్ పిక్స్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఇక వారి వారి అభిమాన తారల చిన్న నాటి ఫోటోలను చూస్తూ వాటిని షేర్స్ చేస్తూ.. ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. నిజానికి ఈ ట్రెండ్ ను ఇంత బాగా కొనసాగిస్తున్నది కూడా అభిమానులే అని చెప్పి తీరాలి. ఈ క్రమంలో తాజాగా నేనెవరో చెప్పుకోండి అంటూ మరొక బుడతడి ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చేశాడు. మరి ఆ బుడతడు ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. గెస్ చేసేద్దాం.

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు టోటల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక పాపులర్ హీరో. ఇప్పుడు ఈ హీరో అంటే అభిమానులంతా ఎంతో ప్రాణంగా చూసుకుంటారు. ఇతను ఒక పెద్ద నిర్మాత సంస్థ అధినేత తనయుడు, ఓ ప్రముఖ హీరో మేనల్లుడు. అయినా సరే ఇతను సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లో మాత్రం ఎంతో మంది ఇతని లుక్స్ ను , ఇతని యాక్టింగ్ ను జడ్జ్ చేసేవారు, అవమానించేవారు. ఎంత బాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చినా కూడా.. స్వతహాగా వారికి ఉన్న టాలెంట్ ను ప్రేక్షకుల ముందు ప్రూవ్ చేసుకుంటేనే.. ఇండస్ట్రీలో నెగ్గుగురాగలం అని.. చెప్పుకోడానికి ఈ హీరో జర్నీ ఒక నిజమైన ఉదాహరణ అని చెప్పి తీరాలి. ఎందుకంటే ఎవరైతే అతనిని ట్రోల్ చేశారో.. ఈరోజు వారి చేతే.. చెప్పాలంటే ఇంకా ఎక్కువమంది చేత అతను పొగడ్తల వర్షంలో మునిగితేలుతున్నాడు. ఇప్పటివరకు ఈ హీరో చేసిన సినిమాలు ఒక ఎత్తు.. ఇప్పుడు రాబోయే ఈ హీరో సినిమా మరొక ఎత్తు అనే రేంజ్ లో ఈ హీరో నెక్స్ట్ సినిమా ఉండబోతుంది. ఈపాటికే ఈ హీరో ఎవరో అందరికి గెస్ చేసి ఉంటారు. ఈ హీరో మరెవరో కాదు అభిమానులంతా ప్రేమతో బన్నీ అని పిలుచుకునే.. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించిన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన చిన్న నాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్.. అల్లు రామలింగయ్య మనవడు.. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తనయుడు.. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు. బన్నీ సినీ రంగ ప్రవేశం కూడా మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగానే అరంగేంట్రం చేశాడు. మొదట బాల నటుడిగా విజేత, స్వాతి ముత్యం సినిమాలలో కనిపించాడు బన్నీ. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాగా హిట్ అయినా కూడా కొన్ని విమర్శలైనైతే ఎదుర్కొకా తప్పలేదు. ఇక ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య సినిమా అల్లు అర్జున్ సినీ కెరీర్ లో బెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అప్పటికి ఇప్పటికి కూడా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఆ తర్వాత కూడా దాదాపుగా బన్నీ చేసిన సినిమాలన్నీ కూడా హిట్స్ గానే నిలిచాయని చెప్పి తీరాలి. ఇక ఆఖరిగా అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్టార్ గా గురింపు తీసుకొచ్చిన సినిమా పుష్ప పార్ట్-1 . ఇక ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ గా వస్తున్న పుష్ప పార్ట్-2 గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా బన్నీ బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. మరి, బన్నీ చైల్డ్ హుడ్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి