iDreamPost
android-app
ios-app

వీడియో: కింగ్ కోహ్లీ క్లాసిక్ సిక్సర్.. ఈ షాట్ తప్పక చూడాల్సిందే..!

GT vs RCB- Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో గుజరాత్ పై ఆర్సీబీ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో మార్క్ ప్రదర్శన చేసింది. విరాట్ కోహ్లీ తన క్లాసిక్ హిట్టింగ్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేశాడు.

GT vs RCB- Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో గుజరాత్ పై ఆర్సీబీ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో మార్క్ ప్రదర్శన చేసింది. విరాట్ కోహ్లీ తన క్లాసిక్ హిట్టింగ్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేశాడు.

వీడియో: కింగ్ కోహ్లీ క్లాసిక్ సిక్సర్.. ఈ షాట్ తప్పక చూడాల్సిందే..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఆఖరి మ్యాచుల్లో అద్భుతాలే సృష్టిస్తోంది. తాజాగా గుజరాత్ టైటాన్స్ మీద జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విశ్వరూపం దాల్చింది. బౌలింగ్, ఫీల్డింగ్ లోనే కాకుండా బ్యాటింగ్ లో కూడా అల్లాడించేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ గుజరాత్ బౌలర్లపై చెలరేగి ఆడారు. ముఖ్యంగా కెప్టెన్ డుప్లెసిస్ గుజరాత్ బౌలర్ల మీద జాలి, దయ లేకుండా ప్రతి బంతిని బౌండరీకి తరలించాడు. కింగ్ కోహ్లీ కూడా క్లాసిక్ హిట్టింగ్ తో ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాడు. ముఖ్యంగా ఫస్ట్ ఓవర్లో కోహ్లీ కొట్టిన సిక్సర్లు ఈ సీజన్ కే బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఐపీఎల్ 2024 సీజన్ కే ది బెస్ట్ మ్యాచ్ లా సాగింది. బౌలింగ్ లో విజృంభించిన ఆర్సీబ జట్టు.. బ్యాటింగ్ లో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఆడింది. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ కాసేపు గుజరాత్ బౌలర్లపై దండయాత్ర చేశారు. కెప్టెన్ అయితే జీటీ బౌలర్లను గల్లీ ప్లేయర్లుగా మార్చేశాడు. కేవలం 23 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 64 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో డుప్లెసిస్ అన్ని టీ20 మ్యాచుల్లో కలిపి 10 వేల పరుగులు మైలు రాయిని చేరుకున్నాడు. అది కూడా ఈ ఘనతను ఒక సిక్సర్ తో సాధించడం విశేషం.

ఇంక కింగ్ కోహ్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే.. అది క్లాసిక్ హిట్టింగ్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు ఆర్సీబీ ఫ్యాన్స్ మిస్ అయ్యింది ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్ కు అనుష్క శర్మ రావడం విరాట్ కోహ్లీ అటు ఫీల్డింగ్ లో ఇటు బ్యాటింగ్ లో విజృంభిచడం యాధృచ్ఛికంగా జరిగిపోయాయి. ఈ సీజన్లో కోహ్లీ అద్భుతమైన ఫామ్ తో కొనసాగుతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్ లో ఇంకాస్త స్పెషల్ గా కనిపించాడు. మోహిత్ శర్మ వేసిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బంతిని డాట్ గా మలిచాడు. కానీ ఆ తర్వాతి బంతినే స్టాండ్స్ లోకి పంపేశాడు కోహ్లీ. ఆ షాట్ ఎంత స్టైల్ గా ఆడాడు అంటే.. ఫ్యాన్స్ అంతా అలా చూస్తూ ఉండిపోయారు. ఆఖరి బంతిని కూడా సిక్సర్ గా మలిచాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కొట్టిన ఆ క్లాసిక్ సిక్సర్లు రెండూ నెట్టింట వైరల్ గా మారాయి. కోహ్లీ విజృంభిస్తే ఇలాగే ఉంటుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి.. కోహ్లీ క్లాసిక్ హిట్టింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.