iDreamPost

ఖాతాదారులకు శుభవార్త చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఖాతాదారులకు శుభవార్త చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే యోనో యాప్ ద్వారా కార్డు లేకుండా SBI ఏటీఎంలలో నగదు తీసుకునే వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇదే సౌకర్యాన్ని అప్ గ్రేడ్ చేస్తూ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది SBI. ఈ నిర్ణయంతో ఈ బ్యాంకు ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు SBI తీసుకున్న యోనో అప్ గ్రేడ్ ఏంటి? దీనిని ఎలా వినియోగించుకోవాలంటే?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు లేకుండా ఏటీఎంలలో నగదు తీసుకునే వెసులుబాటును కల్పించిన సంగతి తెలిసిందే. యోనో యాప్ ద్వారా SBI ఖాతాదారులకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఇన్ని రోజులు కార్డు లేకుండా SBI ఏటీఎంలోనే మాత్రమే నగదు తీసుకునే సదుపాయం ఉండేది. కానీ, తాజాగా SBI ఈ సేవలను మిగతా బ్యాంకు ఏటీఎంలకు విస్తరిస్తూ.. నగదును తీసుకునేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు యోనో యాప్ ను అప్ గ్రేడ్ చేసినట్లుగా ప్రకటించింది. దీంతో ఇప్పటి నుంచి SBI ఖాతాదారులు ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా కార్డు లేకుండా నగదును తీసుకోవడానికి వీలుగా మారింది. ఈ విషయం తెలుసుకున్న SBI ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి