iDreamPost

SBI బంఫర్ ఆఫర్.. లక్ష పెడితే భారీగా లాభం

దేశంలో అతిపెద్ద బ్యాంక్ SBI స్పెషల్ స్కీం తీసుకువచ్చింది. అయితే గతంలో పలుమార్లు పొడిగించింది. ఇది వచ్చే నెలతో ఈ పథకం గడువు పూర్తి కానుంది. తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ కావాలనుకునే వారికి ఇదొక సదవకాశం.

దేశంలో అతిపెద్ద బ్యాంక్ SBI స్పెషల్ స్కీం తీసుకువచ్చింది. అయితే గతంలో పలుమార్లు పొడిగించింది. ఇది వచ్చే నెలతో ఈ పథకం గడువు పూర్తి కానుంది. తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ కావాలనుకునే వారికి ఇదొక సదవకాశం.

SBI బంఫర్ ఆఫర్.. లక్ష పెడితే భారీగా లాభం

దేశంలో అత్యంత ట్రస్ట్ బ్యాంక్ ఏదైనా ఉంది అంటే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‍బీఐ)అని భావిస్తుంటారు చాలా మంది. ఆ సంస్థ విస్తృతమైన సేవలే ఆ పేరుకు కారణం. అలాగే ఇండియాలోనే అతిపెద్ద విత్త సంస్థ కూడా ఇదే కావడం విశేషం. తమ సేవల్లో భాగంగా పలు రుణాలు మంజూరు చేయడమే కాకుండా..పలు సేవింగ్ స్కీమ్స్ కూడా తీసుకు వచ్చిన సంగతి విదితమే. అందులో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ కూడా ఒకటి. ఎస్‌బీఐ అమృత్ కలశ్ అనే స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం అత్యధిక వడ్డీని ఆఫర్ చేస్తూ వినియోగదారుల్ని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ స్పెషల్ స్కీం అమల్లో ఉండగా.. డిసెంబర్ 31తోనే గడువు ముగిసింది. అయితే మరో మూడు నెలలు పొడిగిస్తన్నట్లు ప్రకటించింది ఎస్‍బీఐ . ఇప్పుడు మార్చి 31 వరకు అందుబాటులో ఉండనునంది

ఈ స్కీం కాల పరిమితి 400 రోజులు ఉంటుంది. దీంట్లో సాధారణ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. సాధారణప్రజలకు రూ. 7.10 శాతం వడ్డీ వస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ పథకంలో చేరాలంటే.. స్టేట్ బ్యాంక్ బ్రాంచ్‌లో సంప్రదించాలి. లేదా ఇంటర్నెట్ బ్యాకింగ్, SBI YONO ఛానెల్స్ ద్వారా కూడా చేరొచ్చు. ఇందులో స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏదైనా అవసరం అనుకుంటే… ప్రీ మెచ్యూర్డ్ విత్ డ్రాయల్ ఆప్షన్ కూడా ఉంది. అయితే వడ్డీ రేటు కాస్త తగ్గుతుంది. దీనిపై లోన్ తీసుకునే సదుపాయాన్ని కూడా అందిస్తోంది ఎస్‍బీఐ. ఇక బ్యాంకు ఇచ్చే వడ్డీని నెలవారీగా, ఆరు నెలలకు రెండు సార్లు, ఏడాదికి ఒకసారి పొందొచ్చు. వడ్డీ, టీడీఎస్ నేరుగా కస్టమర్ అకౌంట్లోనే పడుతుంది.

ఉదాహరణకు రెగ్యులర్ సిటిజన్లు ఓ లక్ష డిపాజిట్ చేస్తే..400 రోజులకు గానూ.. సుమారు లక్షా ఏడు వేల వరకు చేతికి అందుతుందని తెలుస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే.. 1,08, 000లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఎస్‍బీఐ సాధారణ డిపాజిట్ వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై కనిష్టంగా 3 శాతం నుండి గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అయితే 50 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ వస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుండి 7.50 శాతం వడ్డీవస్తుంది. మార్చి 31 వరకు ఈ స్పెషల్ స్కీం అందుబాటులో ఉండనుంది. ఇది మంచి అవకాశం.. వినియోగించుకోవాలనుకుంటే.. వచ్చే నెల ఎండ్‌కు ముగిసిపోతుంది. త్వరపడండి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి