iDreamPost

SBIలో ఆ అకౌంట్ ను మిస్ చేసుకోవద్దు.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

బ్యాంకులు కస్టమర్లకు అనేక రకాల సేవలను అందిస్తూ ఉంటాయి. ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కోసం ప్రత్యేకమైన అకౌంట్ ను రూపొందించింది. ఆ అకౌంట్ తో బోలెడన్నీ ప్రయోజనాలు అందుకోవచ్చు.

బ్యాంకులు కస్టమర్లకు అనేక రకాల సేవలను అందిస్తూ ఉంటాయి. ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కోసం ప్రత్యేకమైన అకౌంట్ ను రూపొందించింది. ఆ అకౌంట్ తో బోలెడన్నీ ప్రయోజనాలు అందుకోవచ్చు.

SBIలో ఆ అకౌంట్ ను మిస్ చేసుకోవద్దు.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎన్నో సేవలను అందిస్తోంది. ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నారు. తాము సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేందుకు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్ అకౌంట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే బ్యాంకులు కస్టమర్ల అవసరాలకు తగినట్టుగా అకౌంట్లను జారీ చేస్తుంటాయి. ఈ అకౌంట్లతో ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. ముఖ్యంగా ఉద్యోగుల కోసం బ్యాంకులు శాలరీ అకౌంట్లను జారీ చేస్తుంటాయి. కాగా ఎస్బీఐ ఉద్యోగుల కోసం శాలరీ ప్యాకేజీ అకౌంట్ ను రూపొందించింది. ఈ శాలరీ అకౌంట్ తో బోలెడన్నీ ప్రయోజనాలు, ఆ సేవలు ఫ్రీగా పొందొచ్చు.

బ్యాంకుల్లో సేవింగ్ ఖాతాలతో పాటు శాలరీ ఖాతాలు కూడా ఉంటాయి. కాగా ఎస్బీఐ శాలరీ అకౌంట్ అనేది జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే కస్టమర్లు మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయాల్సిన పనిలేదు. అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోయినా ఏ విధమైన ఛార్జీలు బాదుడు ఉండదు. ఈ శాలరీ అకౌంట్ ద్వారా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలను వినియోగించుకోవచ్చు. ఈ శాలరీ అకౌంట్ ను తీసుకునేందుకు ఎవరు అర్హులు అంటే.. ప్రైవేట్/పబ్లిక్ సెక్టార్ కార్పొరేట్‌లు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ప్రమోటర్లు/వ్యవస్థాపకులు మొదలైన సాధారణ ఉద్యోగులు అర్హులు.

శాలరీ అకౌంట్ ప్రయోజనాలు.. సేవలు:

శాలరీ అకౌంట్ ఉన్న కస్టమర్లు అర్హతను బట్టి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. శాలరీ అకౌంట్ తీసుకున్న కస్టమర్లకు బ్యాంక్ స్పెషల్ డెబిట్ కార్డ్‌ ఇస్తుంది. భారతదేశం అంతటా ఎస్బీఐ, ఇతర బ్యాంక్ ఏటీఎంలలో కస్టమర్లు అపరిమిత సంఖ్యలో ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. కస్టమర్‌లు పర్సనల్‌, విమాన ప్రమాదాలపై ఇన్సూరెన్స్‌ కవరేజీ పొందుతారు. పర్సనల్‌ లోన్‌లు, కారు, గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు పొందుతారు. వార్షిక లాకర్ అద్దెపై 50% వరకు తగ్గింపు లభిస్తుంది. డ్రాఫ్ట్‌లు, మల్టీ సిటీ చెక్కులు, ఎస్ఎంఎస్ హెచ్చరికలను ఉచితంగా పొందొచ్చు. నెఫ్ట్/ఆర్టీజీఎస్ పద్ధతుల్లో ఉచిత ఆన్‌లైన్ లావాదేవీలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి