iDreamPost

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ కన్ఫార్మ్ అయ్యాక మాత్రమే..!

IRCTC Good News: దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎక్కువగా రైల్వే ప్రయాణం చేయడానికే ఇష్టపడుతుంటారు. ఇటీవల చాలా మంది ఆన్ లైన్ లోనే టికెట్స్ బుకింగ్ చేస్తున్నారు.

IRCTC Good News: దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎక్కువగా రైల్వే ప్రయాణం చేయడానికే ఇష్టపడుతుంటారు. ఇటీవల చాలా మంది ఆన్ లైన్ లోనే టికెట్స్ బుకింగ్ చేస్తున్నారు.

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ కన్ఫార్మ్ అయ్యాక మాత్రమే..!

భారత దేశంలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. దేశంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయగల సౌకర్యం రైళ్లలో మాత్రమే ఉంటుంది. అంతేకాదు సుదూర ప్రయాణాలు చేసేవారికి అన్ని వసతులు ఉండటంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్ ప్రయాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్ధులు ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఇటీవల ఎక్కువ మంది రైల్వే టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా బుక్ చేస్తున్నారు. కొన్నిసార్లు దీని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు.. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

రైల్ ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పంది. ఇటీవల చాలా మంది ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా బుక్ చేస్తున్నారు. కొన్ని సందర్బాల్లో టికెట్ కన్ఫామ్ కాకున్నా.. అకౌంట్ లో డబ్బులు కట్ అవుతుంటాయి. తత్కాల్ వంటి లావాదేవీల్లో ఇది కామన్ గా జరుగుతుంది.  ఒకవేళ టికెట్ కన్ఫామ్ అయినా మీ ప్రయాణం రద్దు చేసుకుంటే తిరిగి డబ్బులు అకౌంట్ లోకి వెనక్కి రావడానికి సమయం పడుతుంది. ఇది వినియోగదారులకు చాలా ఇరిటేషన్ గా ఉంటుంది. ఈక్రమంలోనే ఇండియన్ రైల్వే ఓ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం టికెట్ బుక్ అయిన తర్వాత మాత్రమే డబ్బులు కట్ అయ్యే విధంగా కొత్త విధానం అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంలో మీరు టికెట్ బుక్ చేసినా.. టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత మీ వాలెట్ లో నుంచి డబ్బులు కట్ అయ్యే విధంగా మెకానిజం ని ఐఆర్‌సీటీసీ ప్రవేశపెట్టింది.

కొత్తగా ఐఆర్‌సీటీసీ ద్వారా ఐ-పే మేమెంట్ గేట్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని ఆటో పే అని అంటారు. యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో కూడా ఇది పనిచేస్తుంది. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో ‘సిస్టమ్ రైల్వే టికెట్ కోసం పీఎన్ఆర్ ని రూపొందించినపుడు వినియోగదారుడు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకుంటుంది. ఈ సిస్టమ్ యూపీఐ ని ఉపయోగించి ఐపీఓ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది. మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు కట్టారు. కానీ బెర్త్ చాయిస్ నాట్ మెట్ లేదా నో రూమ్ అని చూపించిందనుకోండి.. మీరు టికెట్ రద్దు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి.

ఈ యాప్ ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే.. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లోకి వెళ్లి యాప్ కి మీ ప్రయాణ వివరాలు, ప్రయాణికులు వివరాలు నమోదు చేయాలి. మీరు ఎంచుకున్న బెర్త్ ఎంపిక కోసం చెల్లింపులకు సంబందించిన బటన్ నొక్కాలి. ‘ఐపే’ అని పిలిచే చెల్లింపు గేట్ వే పై క్లిక్ చేస్తే.. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో అనేక రకాల చెల్లింపు విధానాలు ఉంటాయి. ఆటో పే, క్రెడిట్ కార్డు, ఐఆర్సీటీసీ క్యాష్, నెట్ బ్యాంకింగ్ ఉంటాయి. ఆటో పే ఆప్షన్ ను ఎంచుకోవాలి.. ఈ ఆటో పే ఎంపికలో మూడు రకాల ఎంపిక విధానం ఉంటాయి. అవి యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లో ఒకదానిపై క్లీక్ చేసి.. అవసరమైన సమాచారం నమోదు చేయాలి. అలా నమోదు చేసిన తర్వాత మీరు నిర్ధారించిన ప్రయాణ వివరాలు, టికెట్ బుక్ అయిన తర్వాత మాత్రమే మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి. టికెట్ బుక్ కాకుంటే ఎలాంటి కటింగ్ ఉండదు. ఈ విధానంపై ప్రయాణికులు హర్షం వ్యకం చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి