iDreamPost

PhonePe, GPay వాడే వారికి RBI గుడ్ న్యూస్! దెబ్బకు దిగి వస్తున్న బ్యాంక్స్!

  • Published Jun 08, 2024 | 4:53 PMUpdated Jun 08, 2024 | 4:53 PM

ప్రస్తుత కాలంలో Google Pay , Phone Pay వంటి ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ యాప్‌ లకు ఎంతటి ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ యూప్స్ ను వినియోగించే వారికి ఆర్బీఐ ఓ గుడ్ న్యూస్ అందించింది.ఇంతకి అదేమిటంటే..

ప్రస్తుత కాలంలో Google Pay , Phone Pay వంటి ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ యాప్‌ లకు ఎంతటి ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ యూప్స్ ను వినియోగించే వారికి ఆర్బీఐ ఓ గుడ్ న్యూస్ అందించింది.ఇంతకి అదేమిటంటే..

  • Published Jun 08, 2024 | 4:53 PMUpdated Jun 08, 2024 | 4:53 PM
PhonePe, GPay వాడే వారికి RBI గుడ్ న్యూస్! దెబ్బకు దిగి వస్తున్న బ్యాంక్స్!

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసిన అంతా డిజిటల్ పేమెంట్స్ హవానే ఎక్కువగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే చిన్న పాన్ షాప్ నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఏది కొనుగోలు చేయాలన్న అంతా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ప్రొసెస్ ను అనుసరిస్తున్నారు.అలా క్షణాల్లో డబ్బలును ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం రావడంతో.. ప్రజాలు కూడా ఈ అన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ కి అలవాటు పడటంతో ఎక్కడికి వెళ్లిన మొదటిగా డిజిటల్ పేమంట్స్ కే ఎక్కువ మగ్గు చూపుతున్నారు.ఈ క్రమంలోనే.. ఇప్పుడునన్న అన్ని రంగాల్లో డిజిటల్ పేమంట్స్ అనేది అవసరంగా మారిపోయింది.కాగా, ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ డిజిటల్ చెల్లింపులు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతుంది. ఇక వాటిలో ఎక్కువగా Google Pay , Phone Pay వంటి ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ యాప్‌ లకు ఎక్కువగా ప్రజాదరణ ఉందని చెప్పవచ్చు.అయితే తాజాగా ఈ యూప్స్ ను వినియోగించే వారికి ఆర్బీఐ ఓ గుడ్ న్యూస్ అందించింది.ఇంతకి అదేమిటంటే..

బ్యాకింగ్ రంగాలకు సంబంధించిన ఏ చిన్న విషయాల్లో అయినా ఆర్బీఐ కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలను తీసుకుంటు వివిధ బ్యాకింగ్ రంగాలకు తమ నిర్ణయాలను ఆదేశిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లైట్ లో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. అనగా యూపీఐ ద్వారా చిన్న మొత్తంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా యూనిఫైట్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లైట్ లో ఆటోమేటిక్ గా నగదు లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇక ఈ విధానంలో చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఫాస్టాగ్ కు సైతం ఇదే విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తే.. చిన్న మొత్తాల పేమెంట్స్ కూడా మరింత పెరుగుతాయని ఆర్బీఐ వెల్లడించింది.

అయితే యూపీఐకి చెందిన సులభతరమైన వెర్షనే ఈ యూపీఐ లైట్. కాగా, ఇది ఒక వ్యాలెట్ మాదిరిగా పని చేస్తుంది. ఎందుకంటే.. దీని ద్వారా పేమెంట్లు చేసేటప్పుడు పిన్ అవసరం ఉండదు. కాగా, ప్రస్తుతం యూపీఐ లైట్ సేవ వినియోగదారులకు తమ వాలెట్ లో రూ.2000 వరకు లోడ్ చేయడానికి, రూ. 500 వరకు ట్రాన్సాక్షన్లు చేయడానికి సహాయపడేది. కానీ, ఇప్పుడు ఇది పూర్తిగా మారబోతుందని తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇప్పుడు UPI వినియోగదారులు లైట్ వాలెట్ కోసం ఆటో-రిప్లెనిష్‌మెంట్ ఫీచర్ నుంచి ప్రయోజనం పొందుతారు. అనగా.. యూపీఐ లైట్‌లో లిమిట్ కంటె బ్యాలెన్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్స్ లోడ్ అవుతాయి. పైగా ఈ లిమిట్‌ను యూజర్లే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక చిన్న చిన్న ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అలాగే  రికరింగ్ పేమెంట్స్‌కు ఇ-మ్యాండేట్ వాడకం పెరిగిందని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వంటి వాటికి కూడా ఆటో లోడ్ సదుపాయాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి