iDreamPost

మహిళలు ఇంటి వద్దే ఉంటూ నెలకు 2 లక్షలు సంపాదించే అవకాశం

Business Idea For Women: ప్రస్తుత రోజుల్లో రెండు చేతులా సంపాదన లేకపోతే కుటుంబం సాఫీగా సాగే పరిస్థితి ఉండటం లేదు. సిటీల్లో అయితే ఉద్యోగాలు చేసుకుని బతుకుతారు. కానీ, పల్లెటూళ్లలో మాత్రం ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటే మంచి ఆదాయం ఉంటుంది.

Business Idea For Women: ప్రస్తుత రోజుల్లో రెండు చేతులా సంపాదన లేకపోతే కుటుంబం సాఫీగా సాగే పరిస్థితి ఉండటం లేదు. సిటీల్లో అయితే ఉద్యోగాలు చేసుకుని బతుకుతారు. కానీ, పల్లెటూళ్లలో మాత్రం ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటే మంచి ఆదాయం ఉంటుంది.

మహిళలు ఇంటి వద్దే ఉంటూ నెలకు 2 లక్షలు సంపాదించే అవకాశం

సిటీ అయినా.. గ్రామాలు అయినా ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. మెట్రోపాలిటన్ సిటీలు అయితే బతకడానికి ఏడాదికి రూ.20 లక్షలు కావాల్సి వస్తున్నాయి అంటున్నారు. ఇలాంటి తరుణంలో భాగస్వామ్యులు ఇద్దరూ రెండు చేతులా సంపాదిస్తే గానీ.. బతుకు బండి ముందుకు సాగదు. సిటీల్లో ఉండేవాళ్లు భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేయడం ద్వారా కావాల్సిన డబ్బు సంపాదించుకుంటున్నారు. అయితే గ్రామాల్లో ఉండే వాళ్లు వ్యవసాయం, కూలీ పనుల ద్వారానే సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇంటి వద్దే ఉంటూ నెలకు లక్షల్లో సంపాదించుకునే ఒక బిజినెస్ ఐడియా తీసుకొచ్చాం.

గ్రామాలు, పల్లెటూర్లలో ఉండే మహిళలు సాధారణంగా పొలం పనులకు వెళ్తారు. అయితే అవి సీజనల్ కాబట్టి కొన్ని రోజులు పని ఉంటే మరికొన్ని రోజులు ఉండకపోవచ్చు. కానీ, పాడి పరిశ్రమను నమ్ముకుంటే 365 రోజులు కావాల్సిన డబ్బును సంపాదించుకోవచ్చు. వాటిలో గేదెలు అంటే కాస్త పని ఎక్కువగా ఉంటుంది. పైగా నీళ్లు కూడా ఎక్కువగా అవసరం అవుతాయి. కానీ, గొర్రెలు/ మేకల పెంపకానికి మాత్రం అంత నీళ్లు అవసరం ఉండదు. పైగా ఒక గేదెను కొనే డబ్బుతో ఎన్నో మేక పిల్లలను కొనుగోలు చేయచ్చు. వాటి పోషణ, పెంపకం కూడా రిస్క్ తక్కువగా ఉంటుంది.

2 lakhs money

ఈ మేకల పెంపకానికి గ్రామాలు అయితే సరైన స్థలాలుగా చెప్పచ్చు. సిటీలో అయితే మేకలను పెంచేందుకు కావాల్సిన స్థలం ఉండదు. సౌకర్యాలు ఉండవు, కావాల్సిన గడ్డి దొరకదు. కానీ, గ్రామాల్లో మాత్రం మేకలు పెంచేందుకు అనుకూల సౌకర్యాలు, వాతావరణం ఉంటుంది. మేక పిల్లలను కొనుగోలు చేసి వాటిని పెంచి పెద్ద చేసిన తర్వాత అమ్ముకుంటే మంచి లాభాలు వస్తాయి. పైగా ఇప్పుడు మాంసం తినే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో పాడి పరిశ్రమలో మేకలు, గొర్రెల పెపకం మంచి లాభాలను ఇస్తుంది. అలాగే కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అవి బలంగా, పుష్టిగా తయారవుతాయి. తద్వారా లాభాలు కూడా అధికంగా వస్తాయి. పైగా ప్రభుత్వాలు వీటి కోసం సబ్సిడీని కూడా ఇస్తూ ఉంటాయి.

మేకలు/గొర్రెల పెంపకానికి పొడి వాతావరణం, నీటి లభ్యత కాస్త తక్కువగా ఉన్నా సరిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ప్రాంతాలు చాలానే ఉన్నాయి. పైగా ఇప్పటికే వీటిని పెంచుతున్న వారిని సంప్రదించి మెళకువలు కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఒకవేళ మీ దగ్గర 18 మగ మేకలు ఉంటే మీకు నెలకు రూ.1.98 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అదే మీదగ్గర 18 ఆడ మేకలు ఉంటే నెలకు రూ.2.16 లక్షల వరకు ఆదాయం సంపాదించవచ్చు అని చెప్తున్నారు. అయితే ఏ వ్యాపారం అయినా.. పాడి పరిశ్రమ అయిన పూర్తి అవగాహన, నిపుణల సలహా, మీ ఆసక్తిని బట్టే నిర్ణయం తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం అవగాహన కల్పించడం కోసం మాత్రమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి