iDreamPost
android-app
ios-app

మాక్స్ వెల్ ఊచకోత.. వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ

  • Author Soma Sekhar Published - 07:08 PM, Wed - 25 October 23

ఆసీస్ బ్యాటర్లు పసికూన నెదర్లాండ్స్ బౌలర్లపై ఓ యుద్దాన్నే ప్రకటించారు. తొలుత వార్నర్ సెంచరీతో ఊచకోత మెుదలు పెడితే.. ఆ తర్వాత దాన్ని ఊహించని రేంజ్ కు తీసుకెళ్లాడు స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్.

ఆసీస్ బ్యాటర్లు పసికూన నెదర్లాండ్స్ బౌలర్లపై ఓ యుద్దాన్నే ప్రకటించారు. తొలుత వార్నర్ సెంచరీతో ఊచకోత మెుదలు పెడితే.. ఆ తర్వాత దాన్ని ఊహించని రేంజ్ కు తీసుకెళ్లాడు స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్.

  • Author Soma Sekhar Published - 07:08 PM, Wed - 25 October 23
మాక్స్ వెల్ ఊచకోత.. వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం ఫోర్లు, సిక్సర్లతో తడిచి ముద్దైంది. ఆసీస్ బ్యాటర్లు పసికూన నెదర్లాండ్స్ బౌలర్లపై ఓ యుద్దాన్నే ప్రకటించారు. తొలుత వార్నర్ సెంచరీతో ఊచకోత మెుదలు పెడితే.. ఆ తర్వాత దాన్ని ఊహించని రేంజ్ కు తీసుకెళ్లాడు స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్. అతడి నుంచి ఎప్పుడెప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఫోర్లు, సిక్సర్లతో కన్నుల విందు చేశాడు. డచ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న మాక్సీ కేవలం 40 బంతుల్లోనే శతకం బాది.. వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలోనే మార్క్రమ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

వన్డే వరల్డ్ కప్ 2023లో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు అయ్యింది. ఢిల్లీ వేదికగా ఆసీస్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో డచ్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. జట్టులో వార్నర్ (104), లబూషేన్(62), స్టీవ్ స్మిత్(71) పరుగులతో రాణించగా.. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్.. డచ్ బౌలర్లకు తన విశ్వరూపాన్ని చూపాడు. ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ.. వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని బాదాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి.. మార్క్రమ్ రికార్డు(49 బంతులు) బద్దలు కొట్టాడు.

కాగా.. ఈ ప్రపంచ కప్ లోనే మార్క్రమ్ శ్రీలంక మీద ఈ రికార్డు సాధించగా.. తాజాగా ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు మాక్సీ. ఓవరాల్ గా మాక్స్ వెల్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్ లతో 106 పరుగులు చేసి 7వ వికెట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో 240 స్ట్రైక్ రేట్ తో మాక్స్ వెల్ బ్యాటింగ్ చేయడం విశేషం. మాక్సీ వీరోచిత బ్యాటింగ్ తో ఆసీస్ భారీ స్కోర్ సాధించింది. పసికూన ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. కాగా.. 2015 వరల్డ్ కప్ లో కూడా మాక్స్ వెల్ శ్రీలంకపై 51 బంతుల్లోనే శతకం బాది రికార్డు నెలకొల్పాడు. మరి మాక్స్ వెల్ ఊచకోతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)