iDreamPost

శృతిహాసన్, తాప్సి మధ్య వార్! ఇద్దరూ తగ్గట్లేదుగా!

డిసెంబర్ 22న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలకానుంది. ఇదే రోజు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీ కూడా రిలీజ్ కు సిద్దమైంది. అయితే సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, డంకీలో తాప్సీ అలరించబోతోంది.

డిసెంబర్ 22న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలకానుంది. ఇదే రోజు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీ కూడా రిలీజ్ కు సిద్దమైంది. అయితే సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, డంకీలో తాప్సీ అలరించబోతోంది.

శృతిహాసన్, తాప్సి మధ్య వార్! ఇద్దరూ తగ్గట్లేదుగా!

ఒక సినిమా సక్సెస్ లో కథకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో హీరోయిన్ల గ్లామర్ కూడా అంతే కీ రోల్ పోషిస్తుంటుంది. హీరోయిన్ల తళుకు బెళుకులు ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంటాయి. సొగసులతో మంత్ర ముగ్ధులను చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు హీరోయిన్స్. అయితే సినిమాలో హీరోయిన్స్ కు ఇంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ పోటీ మాత్రం హీరోల మధ్యనే అన్నట్లు ట్రీట్ చేస్తుంటారు. ఇక అగ్ర హీరోల సినిమాలు ఒకే సారి విడుదలైతే ఫ్యాన్స్ చేసే రచ్చే వేరుగా ఉంటుంది. కాగా వచ్చే నెల 22న ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుదలకాబోతున్నాయి. అయితే ఈ సినిమాల్లో హీరోల మధ్య పోటీ అటుంచితే గ్లామర్ క్వీన్స్ మధ్య పోటీ ఉండనుందని చర్చ మొదలైంది.

డిసెంబర్ 22న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలకానుంది. ఇదే రోజు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీ కూడా రిలీజ్ కు సిద్దమైంది. అయితే సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, డంకీలో తాప్సీ అలరించబోతోంది. యాక్టింగ్, అందం పరంగా ఈ ఇద్దరు హీరోయిన్లకు ఫుల్ క్రేజ్ ఉంది. హుషారైన డ్యాన్స్ లతో, వయ్యారాలు ఒలకబోస్తూ గ్లామర్ మెరుపులు మెరిపించడంలో శృతిహాసన్, తాప్సీ ఎవరికి వారే స్పెషల్. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ స్టార్ డమ్ సాదించారు.

ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో హిట్స్ అందుకున్న శృతిహాసన్ సలార్ తో హిట్ కొట్టి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని చూస్తోంది. తాప్సీ కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో హీరోయిన్ గా యాక్ట్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. కాగా తాప్సీ నటించిన డంకీ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షారుఖ్ డంకీ తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. సలార్, డంకీ సినిమాల కోసం ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు హీరోలకు ఎంత ఇంపార్టెంట్ గా మారాయో హీరోయిన్స్ కు కూడా అంతే ముఖ్యమయ్యాయి. తాప్సీ, వర్సెస్‌ శ్రుతి అంటూ జరుగుతున్న గ్లామర్ పోటీలో ఇద్దరూ నెగ్గుతారా? ఇద్దరిలో ఒకరే నెగ్గుతారా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి