iDreamPost

ఈ బుంగమూతి చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్.. టాప్ హీరోలను మడతపెట్టేసింది

ఈ ఫోటోలో బుంగమూతి పెట్టుకున్న చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఐరెన్ లెగ్ ముద్ర పడినప్పటికీ.. వరుస ఆఫర్లతో స్టార్ స్టేటస్ పొందింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

ఈ ఫోటోలో బుంగమూతి పెట్టుకున్న చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఐరెన్ లెగ్ ముద్ర పడినప్పటికీ.. వరుస ఆఫర్లతో స్టార్ స్టేటస్ పొందింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

ఈ బుంగమూతి చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్.. టాప్ హీరోలను మడతపెట్టేసింది

హీరోయిన్ ఖాతాలో ఒక్క సినిమా హిట్ పడగానే .. ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంది. చాలా మందికి అభిమాన నటిగా మారిపోతుంది. అలా తాను నటించిన సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టగానే గోల్డెన్ లెగ్ అంటూ ముద్ర వేస్తారు. రెండు మూడు ఏళ్లకు సరిపడా కాల్షీట్స్‌తో ఖాళీ లేకుండా వరుస ఆఫర్లను కొల్లగొడుతుంది. అలాగే రెమ్యునరేషన్ కూడా అమాంతంగా పెరిగిపోతుంది. పొరుగింటి పరిశ్రమ కూడా రారా అంటూ అవకాశాలు ఇస్తుంది. అదే హీరోయిన్ చేసిన మూవీస్ అన్నీ ప్లాప్స్ వస్తే ఐరెన్ లెగ్ అంటూ మాట్లాడుకుంటారు. ఆమెకు ఛాన్సులు కూడా ఇచ్చేందుకు వెనకాడుతుంటారు దర్శక నిర్మాతలు. ఇలాంటి ముద్రతోనే టాలెంట్ ఉన్నా.. అనేక మంది నటీమణులు సరైన అవకాశాలు ఇండస్ట్రీ నుండి వైదొలిగారు.

ఈ ఫోటోలోని బ్యూటీ అందుకు మినహాయింపు. ప్లాప్స్ ఎదురైనా.. టాప్ హీరోల్లో ఛాన్సులు కొల్లగొట్టింది. మరో ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరిచింది. స్టార్ డమ్ చూసింది. ఇప్పుడు వరుస ప్లాపులతో సతమతమౌతుంది. దీంతో ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. ఈ పిక్ లో కనిపిస్తున్న చిన్నారి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను మడత పెట్టేసింది. ప్లాప్స్ వచ్చినా.. ఐరెన్ లెగ్ అన్న ముద్ర పడినా.. ఛాన్సులకు కొదవ లేదు. ఈ ముద్ర చెరిపేసుకునేందుకు గట్టిగా ప్రయత్నించి.. సక్సెస్ అందుకుంది. ఇంతకు ఆ అమ్మడు ఎవరంటే.. పూజా హెగ్డే. కర్ణాటకలో పుట్టి.. ముంబయిలో పెరిగింది ఈ ముద్దుగుమ్మ. 2010లో మిస్ యూనివర్స్‌కు పోటీ చేసి సెకండ్ రన్నరన్‌గా నిలిచింది.

జీవా హీరోగా వచ్చిన మూగ మూడి (మాస్క్) మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పూజా.. ఒక లైలా కోసం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ముకుంద మూవీ తర్వాత ఆమెకు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన హృతిక్ సరసన మొహంజాదారోలో నటించింది. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ ఆమెకు ఛాన్సులు క్యూ కట్టాయి. దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత వీర రాఘవ వంటి యావరేజ్ హిట్స్ వచ్చాక.. మహర్షిలో అవకాశం వచ్చింది. గద్దల కొండ గణేష్ కీ రోల్ లో కనిపించింది. ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లింది. హౌస్ ఫుల్ 4లో యాక్ట్ చేసింది. అలా వైకుంఠపురం బ్లాక్ బస్టర్స్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్లు చూసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సల్మాన్ ఖాన్ సరసన కిబీ కా భాయ్.. కిసి కా జాన్ తో గత ఏడాది పలకరింగా.. మూవీ సల్మాన్ ఫ్యాన్స్‌ను కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం దేవా అనే మూవీ చేస్తోంది. పలు ప్రాజెక్టులు కథలు వింటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి