iDreamPost

పని వెతుక్కొంటూ వచ్చి.., తప్పుడు పని! పోలీసులే షాక్ అయ్యే సంఘటన!

ప్రేమ గుడ్డిది అంటుంటారు పెద్దలు. ఇటీవల పెళ్లిళ్లు చూస్తుంటే నిజమని అనిపించకమానదు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులదీ కూడా అలాంటి ప్రేమే. అతడికి 32 ఏళ్లు.. ఆమెకు 20. ఇద్దరు కలిసి

ప్రేమ గుడ్డిది అంటుంటారు పెద్దలు. ఇటీవల పెళ్లిళ్లు చూస్తుంటే నిజమని అనిపించకమానదు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులదీ కూడా అలాంటి ప్రేమే. అతడికి 32 ఏళ్లు.. ఆమెకు 20. ఇద్దరు కలిసి

పని వెతుక్కొంటూ వచ్చి.., తప్పుడు పని! పోలీసులే షాక్ అయ్యే సంఘటన!

ప్రేమకు హద్దులు సరిహద్దులు లేవు. అలాగే కుల మతాలు అడ్డుగోడలు కాదు. వయస్సు తారతమ్యం లేదు. తొలి చూపులోనే ప్రేమలో పడి..తమ బంధాన్ని పెళ్లితో మరింత బలోపేతం చేసుకుంటున్నారు కొందరు. ఏ ప్రేమకు అయినా పెద్దలే విలన్లు. తమకు నచ్చిన వ్యక్తిని మనువాడతామంటే.. ససేమీరా అంటారు. వారిదేం కులం, మనదేం కులం.. వారి తహత్తు ఏంటీ.. మన తహత్తు ఏంటీ అంటూ ఓల్డ్ డైలాగ్స్ చెబుతుంటారు. దీంతో ‘మేం ప్రేమికులం, మాది ప్రేమకులం.. మా ప్రేమను ఆపేదెవరు’ అంటూ పెద్దలను ఎదిరించి, ఇంట్లో నుండి పారిపోయి.. తమకు నచ్చిన వ్యక్తిని మనువాడుతున్నారు లవర్స్. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు కూడా అలాగే వివాహం చేసుకున్నారు.

కానీ.. అందరి ప్రేమ పెళ్లిళ్లలాగే… వీరి లవ్‌ను కూడా పెద్దలు అడ్డుపడ్డారు. దీంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ పెద్దలు వదల్లేదు.. చంపేందుకు ప్రయత్నించడంతో పోలీసుల చెంతకు చేరింది పంచాయతీ. తమను కాపాడాలని, తమకు ప్రాణ హానీ ఉందని, మీరే రక్షించాలంటూ పోలీసులను వేడుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గొట్టపు బావులు త వ్వేందుకు వచ్చి అక్కడ అమ్మాయిని లైన్లో పెట్టాడు. ఇది తట్టుకోలేని అమ్మాయి బంధువులు అతడిపై దాడి చేయడానికి రాగా, ఖాకీలను ఆశ్రయించారు. ఈ ఘటన రాజస్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలోని రాజల్‌దేసర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అబద్‌సర్‌లో నివాసం ఉంటున్న కిషన్‌సింగ్ (32).. ఏడాది క్రితం జైతసర్ గ్రామంలోని పొలాల్లో గొట్టపు బావి తవ్వే పనికి వెళ్లాడు. అక్కడే కమల అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మొదటి చూపులోనే ఇద్దరు ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. తర్వాత వీరి ప్రేమ చిగురించింది. వీరి పెళ్లికి కులం గోడులు అడ్డువచ్చాయి..  ఇరువురు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరు కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. జూన్ 9న ఇంట్లో నుండి పారిపోయి.. అదే రోజు రతన్‌గఢ్ కోర్టులో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అక్కడ వివాహ ధ్రువీకరణ పత్రం కూడా తయారు చేయించుకున్నారు. అయితే వీరి ప్రేమను ఆమె బంధువులు అంగీకరించలేదు. మా ఇంటి దగ్గరకే వచ్చి.. మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటావా అంటూ మండిపడ్డారు. దీంతో తనకు, తన భార్యకు భద్రత కలిగించాలని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి