iDreamPost

జిమ్స్…ఇండియా సొంత వాట్సప్…!

జిమ్స్…ఇండియా సొంత వాట్సప్…!

అవును నిజమే…ఇండియా త్వరలోనే సొంత వాట్సప్ ను తీసుకురానుంది. ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉన్న నూతన సామాజిక మాధ్యమం ఈ ఏడాదే అందుబాటులోకి రానుంది. అయితే దీన్ని పూర్తిగా ప్రభుత్వ అధికారులు, సంస్థలు కోసం తయారుచేస్తున్నారు. భవిష్యత్తులో సామాన్య జనానికి కూడా అందుబాటులోకి తెస్తారా…లేదా అనేది చూడాల్సి ఉంది.

నేషనల్ infarmatic సెంటర్ (ఎన్.ఐ.సి)…గవర్నమెంట్ ఇన్ స్టాంట్ Mesaging సర్వీస్(జిమ్స్) పేరుతో వాట్సప్ తరహా సామాజిక మద్యమాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని యాండ్రాయిడ్, ఇఓఎస్ లలో వినియోగించవచ్చు. ప్రస్తుతం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోమ్ శాఖ, సమాచార ప్రసార శాఖలతో పాటు రైల్వే, సీబీఐ వంటి 17 ప్రభుత్వ విభాగాల్లో జిమ్స్ బీటా టెస్టింగ్ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు సైతం పరీక్షల్లో పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగా 6,600 మంది యూజర్లు 20 లక్షల మెసేజ్ లను జెనెరేట్ చేశారు.

జిమ్స్ ను 11 ప్రాంతీయ భాషల్లోనూ వినియోగించేలా రూపొందిస్తున్నారు. ఐతే తొలి దశలో ఇంగ్లీష్, హిందీ భాషలు అందుబాటులోకి రానున్నాయి. ఎన్ఐసి ఇప్పటికే ప్రభుత్వం కోసం ప్రత్యేక ఈమెయిల్ సర్వీస్ ను రూపొందించింది. దీనికి రోజుకి 2 కోట్ల మెయిల్స్ ను హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉంది.

అధికారులు, ప్రభుత్వం లోని కీలక వ్యక్తులు వాట్సాప్, వీచాట్ వంటి సామాజిక మాధ్యమాల్లో strategic, sensitive అంశాల గురించి చర్చిస్తున్నారు. Pegasus software సహాయంతో వాట్సాప్ లోని సంభాషణల్లోకి సైబర్ క్రైమ్ దుండగులు, శత్రు దేశాలు తొంగి చూసే ఆస్కారం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన వాట్సప్ ను వినియోగంలోకి తీసుకురానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి