iDreamPost

ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య..కారణం తెలిస్తే కన్నీరు ఆగదు!

తాము అనుకున్న కలలను నేరవేర్చుకున్న వారిలో కొందరు వివిధ కారణాలతో సంసారాన్ని నిట్టనిలువునా కూల్చేకుంటారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఓ దంపతుల విషయంలో దారుణం జరిగింది.

తాము అనుకున్న కలలను నేరవేర్చుకున్న వారిలో కొందరు వివిధ కారణాలతో సంసారాన్ని నిట్టనిలువునా కూల్చేకుంటారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఓ దంపతుల విషయంలో దారుణం జరిగింది.

ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య..కారణం తెలిస్తే కన్నీరు ఆగదు!

ప్రతి ఒక్కరి ప్రభుత్వం ఉద్యోగం రావాలనే కోరిక ఉంటుంది. అలాంటిది  భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే అయితే ఇక వారి సంసారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఎంతో మంది తాను తన భాగస్వామి ఇద్దరు ప్రభుత్వ జాబ్స్ చేయాలన కోరుకుంటారు. అలా కొందరికి మాత్రమే సాధ్యమైవుతుంది. అలా కలను నేరవేర్చుకున్న వారిలో కొందరు వివిధ కారణాలతో సంసారాన్ని నిట్టనిలువునా కూల్చేకుంటారు. అలానే తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగిని విషయంలో ఆమె భర్త చేసిన ప్రవర్తన కారణంగా నిండు జీవితాన్ని బలి చేసుకుంది. ఈ ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..

ములుగు జిల్లా మంగపేట మండలం బోరు నర్సాపూర్‌ గ్రామానికి చెందిన రాంనర్సయ్యకు అదే జిల్లాలోని ఏటూరు నాగారం గ్రామానికి చెందిన సఫియా(38)తో వివాహం జరింది. ఈ వీరిద్దరికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది.  అలానే ఈ దంపతులు ఇద్దరూ  ప్రభుత్వ ఉద్యోగులే. వ్యవసాయ శాఖలో వీరిద్దరు విధులు నిర్వహిస్తున్నారు. పెళ్లైన చాలా కాలం పాటు వీరి సంసారం ఎంతో హాయిగా సాగింది. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో వారికి ఆర్థికంగా కూడా పెద్ద సమస్యలు లేకపోవడంతో సంతోషంగా జీవనం సాగించారు.

వీరికి ప్రస్తుతం 16 ఏళ్ల కుమార్తె ఉంది. రాంనర్సయ్య, సఫియా దంపతులు ప్రస్తుతం హనుమకొండ పట్టణంలోని ఎక్సైజ్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. అలానే రాంనర్సయ్య వర్ధన్నపేట మండలంలో వ్యవసాయ శాఖలో పని చేస్తున్నాడు. అలానే సఫియా వడ్డేపల్లిలోని వ్యవసాయ కార్యాలయంలో పని చేస్తున్నారు.  చాలా కాలంపాటు సంతోషంగా సాగిన ఈ భార్యాభర్తల మధ్య రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. రాంనర్సయ్య చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈక్రమంలోనే భార్య సఫియాను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. అంతేకాక సఫియా పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని తీవ్రంగా హింసించాడు. అతడి వేధింపులకు తట్టుకోలేక సఫియా..పలుమార్లు తన పుట్టింటి వారికి జరిగిన విషయం చెప్పింది. ఇటీవల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి రాంనర్సయ్యకు, సఫియాకు సర్దిచెప్పి పంపించారు.

అలా పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి చెప్పిన కూడా రాంనర్సయ్య తీరులో మార్పు రాలేదు. మళ్లీ ఎప్పటిలాగానే ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగులం, జీవితాన్ని హాయిగా గడపొచ్చని భావించిన సఫియా ఆశలు అడియాశలు అయ్యాయి. జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంది. కానీ అలా మారడంతో ఆమె తీవ్ర వేదన గురైంది. ఇక జీవితంపై విరక్తి చెంది..దారుణానికి ఒడిగట్టింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో సఫియా పడక గదిలోకి వెళ్లి, లోపల తాళం వేసి చున్నీతో ఉరివేసుకొంది. కాసేపటికి సఫియాను గమనించిన  భర్త, కుమార్తె గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. వారు వెళ్లి చూసేసరికి వెళ్లేసరికి ఆమె విగత జీవిగా. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. మొత్తంగా ఎంతో గొప్పగా ఊహించుకున్న జీవితంలో ఇలాంటి వేధింపు రావడంతో ఈ ప్రభుత్వ ఉద్యోగిన తన జీవితాన్ని అర్థాంతరం ముగించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి