హైదరాబాద్ మహానగరంలో చినుకులు పడితే సామాన్య ప్రజలు అల్లాడి పోతారు. ఇటీవల కురిసిన భారీ వానలే అందుకు నిదర్శనం. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక చాలా ప్రాంతాల్లో వ్యర్ధాలు అడ్డుగా ఉండటం వలన భారీగా నీరు నిలిచిపోయింది. ఎక్కడ బడితే అక్కడ వ్యర్ధాలను వేయడం కారణంగా వివిధ రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. భవన నిర్మాణానికి సంబంధించిన వ్యర్దాలు కూడా రోడ్ల పైన వేస్తే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణ, వ్యర్ధాలను అక్రమంగా తరలించే వాహనాలకు భారీగా జరిమాన తప్పదని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.
చెరువులు, రోడ్లు, మూసీ నదిలో వ్యర్ధాలను పడేస్తున్నారని, వారిపై పోలీస్ శాఖ సాయంతో ప్రత్యేక దృష్టి పెట్టామని అధికారులు తెలిపారు. ఇక ఇలా నదులు,చెరువు, రోడ్లపై చెత్త వేస్తూ కనిపిస్తే భారీగా జరిమాన తప్పదని హెచ్చరిస్తున్నారు. భవన నిర్మాణ సమయంలో రోడ్లపైకి చెత్త, ఇసుక, నిర్మాణ వ్యర్ధాలు రాకుండా నిర్మాణ దారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అధికారులు అంటున్నారు.
వ్యర్ధాలు వేస్తూ మొదట సారి దొరికితే రూ.25 వేలు, రెండో సారి రూ.50 వేలు, మూడో సారి దొరికితే రూ.లక్ష జరిమానా ఉంటుందన్నారు. ఎవరైన నిర్మాణ వ్యర్ధాలను తరలించాలంటే 18001201159, 1800203030033 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు తెలిపారు. ఇలా కాల్ చేస్తే నిర్మాణ వ్యర్ధాలను ఇంటికొచ్చి తీసుకెళ్తామన్నారు. వ్యర్ధాల విషయంపై జీహెచ్ఎంసీ ఫోకస్ చేసింది. అందుకే ఇకపై అలా చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. మరి.. జీహెచ్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: జులై 31న రాష్ట్ర కేబినెట్ సమావేశం.. ఏ ఏ అంశాలు చర్చించనున్నారంటే?