iDreamPost

దేశ ప్రజలకు శుభవార్త.. రూ.500కే గ్యాస్ సిలిండర్ !

కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ విషయంలో మార్పులు చేయటంతో.. దిగువ మధ్య తరగతి వారికి గ్యాస్‌ కొనడం చాలా ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ విషయంలో మార్పులు చేయటంతో.. దిగువ మధ్య తరగతి వారికి గ్యాస్‌ కొనడం చాలా ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

దేశ ప్రజలకు శుభవార్త.. రూ.500కే గ్యాస్ సిలిండర్ !

గత కొన్ని సంవత్సరాల నుంచి దేశంలో గ్యాస్‌ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం 14.5 కేజీల డొమస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర 1000 రూపాయలకు పైనే ఉంది. కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ విషయంలో మార్పులు చేయటంతో.. దిగువ మధ్య తరగతి వారికి గ్యాస్‌ కొనడం చాలా ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. గ్యాస్‌ సిలిండర్‌ ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు! దేశ ప్రజలు ఇప్పుడు 500 రూపాయలకే డొమస్టిక్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకం.. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (ఫేజ్ 3) కింద పేద కుటుంబాల వారు ఈ 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ను పొందవచ్చు. మహిళా సాధికారత లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ యోచన చేసింది. ఉజ్వల్ యోజన కింద, మూడవ స్థాయి ఎల్‌పిజి కనెక్షన్ పొందిన వినియోగదారులకు రెండు బర్నర్ల స్టవ్, 14.2 కిలోల సిలిండర్ మరియు రెండు 5 కిలోల సిలిండర్, ఒక రెగ్యులేటర్,

ఒక సేఫ్టీ హోస్, డీజీసీసీ పుస్తకాలు ఉచితంగా అందించనున్నారు. ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలకు చెందిన మహిళలు ఈ స్కీమ్‌ కింద రూ. 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ను పొందవచ్చు. కాగా, గత సంవత్సరం 14.5 కేజీల డొమస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర సబ్సీడీతో 1105 ఉండింది. తర్వాత అది 2023 మార్చికి 1155కు చేరింది. ఆగస్టు నెలలో ధరలు తగ్గాయి..  955 రూపాయలకు వచ్చింది. మరి, కేంద్ర ప్రభుత్వం ధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ అందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి