iDreamPost

Chikoti Praveen: మరోసారి తెరపైకి చికోటి ప్రవీణ్.. కేసు నమోదు చేసిన గజ్వేల్ పోలీసులు!

Chikoti Praveen: మరోసారి తెరపైకి చికోటి ప్రవీణ్.. కేసు నమోదు చేసిన గజ్వేల్ పోలీసులు!

చీకోటి ప్రవీణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్లు ఉండరేమో. ఎందుకంటే క్యాసినో వ్యవహారంలో ఆయన సంచలనంగా మారారు. అంతేకాకుండా ఆయన ఫామ్ హౌస్ తో కూడా బాగా పాపులర్ అయ్యారు. అయితే మరోసారి చీకోటి ప్రవీణ్ తెరపైకి వచ్చారు. తాజాగా గజ్వేల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా గజ్వేల్ పట్టణంలోకి ర్యాలీగా వెళ్లడంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గజ్వేల్ పట్టణంలో జరుగుతున్న పరిణామాలపై సిద్దిపేట శ్వేత స్పందించారు. గజ్వేల్ పట్టణంలో ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టైన వారందరికీ 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీగా వచ్చి వెళ్లిన చీకోటి ప్రవీణ్ పై కూడా కేసు నమోదు చేసిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్ఫష్టం చేశారు. గజ్వేల్ లో ఉన్న ప్రశాంత వాతావరణం దెబ్బతినకుండా ఉండేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

అసలు ఏం జరిగింది అంటే.. మంగళవారం మద్యం మత్తులో శివాజీ విగ్రహం ముందు ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేశాడు. ఆ ఘటనతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. విషయం తెలుసుకున్న స్థానికులు శివాజీ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. స్టేషన్ నుంచి ర్యాలీగా వస్తున్న సమయంలో ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిలో సందీప్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అలా గజ్వేల్ పట్టణం మొత్తం ఆందోళనలు మొదలయ్యాయి. సకాలంలో పోలీసులు స్పందించి మొత్తం వ్యవహారం సద్దుమణిగేలా చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి