iDreamPost

గామి vs భీమా.. ఏ సినిమా బాగుందంటే?

Gaami vs Bhimaa Which Movie Is Best: మహా శివరాత్రికి థియేటర్లలో సందడి నెలకొంది. చాలానే చిత్రాలు విడుదల అయినా.. గామి- భీమాపై మాత్రం మంచి బజ్ వచ్చింది. మరి.. ఈ రెండు చిత్రాల్లో ఏ మూవీ పండగ విన్నరో చూద్దాం.

Gaami vs Bhimaa Which Movie Is Best: మహా శివరాత్రికి థియేటర్లలో సందడి నెలకొంది. చాలానే చిత్రాలు విడుదల అయినా.. గామి- భీమాపై మాత్రం మంచి బజ్ వచ్చింది. మరి.. ఈ రెండు చిత్రాల్లో ఏ మూవీ పండగ విన్నరో చూద్దాం.

గామి vs భీమా.. ఏ సినిమా బాగుందంటే?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ వెల్లివిరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పండగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు ఎంత కామనో.. కొత్త సినిమా కూడా అంతే కామన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు పండగ అంటే ఆ రోజు థియేటర్లో ఒక కొత్త సినిమా చూస్తేనే పూర్తవుతుంది. ఇప్పుడు ఈ శివరాత్రికి థియేటర్లలో విడుదలైన సినిమాల్లో బాగా బజ్ వచ్చినవి, ప్రేక్షకులు ఎక్కువగా చూడాలి అనుకున్నవి గామి, భీమా సినిమాలు. మరి.. ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ బాగుంది? ఏ చిత్రం ఈ శివరాత్రి విన్నర్ అయ్యింది? చూద్దాం.

ఈ గామి- భీమా సినిమాల గురించి మాట్లాడుకుంటే. గామి చిత్రం టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం. అసలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ చిత్రం ఒక కొత్త పేజీ అవుతుంది అంటూ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. పైగా ఈ మూవీ విజువల్ వండర్ అనే చెప్పాలి. మేకర్స్, చిత్ర బృందం ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద పెట్టిన శ్రద్ధ ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తుంది. అలాగని ఇందులో మాస్ డైలాగ్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి అనుకుంటే పొరపాటే అవుతుంది.

డైరెక్టర్ ఎంచుకున్న కథాంశం, దానిని తెరకెక్కించిన తీరు థియేటర్ కు వెళ్లిన ఆడియన్ ని కట్టి పడేస్తుంది. ఈ మూవీలో విద్యాధర్ కాగిత చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తుంది. విశ్వక్ సేన్ కథపై పెట్టుకున్న నమ్మకం కనిపిస్తుంది. చాందినీ చౌదరి సినిమా కోసం పడ్డ కష్టం కనిపిస్తుంది. ఇంక విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, టేకింగ్ అన్నీ కట్టి పడేస్తాయి. కాకపోతే కాస్త స్క్రీన్ ప్లే మాత్రం ఇబ్బంది పెడుతుంది. అది కూడా కథ బాగోక కాదు.. లేవర్స్ కథ ఎక్కువ అవ్వడం వల్లే.

ఇంక భీమా విషయానికి వస్తే.. గోపీచంద్ కు బాగా కలిసొచ్చిన పోలీస్ క్యారెక్టర్ ని ఇరగదీసేశాడు. ఇందులో పైగా భీమా- రామాగా కనిపిస్తాడు. పోలీసు కథకు సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ని ఆపాదించారు. ఇంక గోపీచంద్ తనదైనశైలిలో యాక్టింగ్ ఇరిగదీశాడు. సినిమాని మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తీశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో టేకాఫ్ అయిన 15 నిమిషాలు మంచి ఫీల్ వస్తుంది. కానీ, హీరో ఎంట్రీ తర్వాత క్రమంగా ఆ హై తగ్గుతూ వస్తుంది. అందుకు కారణం మాస్ ఎలివేషన్స్, ఎస్టాబ్లిష్మెంట్ షాట్స్ రొటీన్ గా ఉండటం.

ఎంత కమర్షియల్ సినిమా అయినా.. మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తో ఆ మూవీ ఎక్కడికో వెళ్లిపోతుంది. భీమా కరెక్ట్ గా కనెక్ట్ అయ్యుంటే గామిపై ప్రభావం గట్టిగానే పడేది. కానీ, భీమాకి సంబంధించి ఓవరాల్ గా మంచి మార్కులే పడుతున్నా గామితో కంపారిజన్ వచ్చేసరికి మాత్రం భీమానే కాస్త తగ్గుతోంది. ఏ సినిమాకి ఆ సినిమా తీసుకుంటే రెండింటికి మంచి మార్కులు, మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. కానీ, రెండింటిలో ఏది బాగుంది అంటే మాత్రం గామి సినిమా ఒక మెట్టు పైకి ఎక్కుతోంది. భీమా మాత్రం తూకంలో కాస్త తగ్గుతోంది. మరి.. గామి vs భీమాలో ఏ సినిమా బాగుంది? మీరు ఏ సినిమా చూశారు? మీకు అది ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి