Uppula Naresh
Uppula Naresh
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించింది. ఇక నుంచి TSRTC బస్సుల్లో ఉచిత వైఫై అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటన చేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే? ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులను వారి గమ్యానికి చేర్చడంతో TSRTC ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. వారి ఇబ్బందులను ముందే తెలుసుకుని ఆ దిశగా సమస్యలను పరిష్కరించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.
మరీ ముఖ్యంగా TSRTC ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీని లాభాల్లో పరుగెత్తించేందుకు సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన ప్రయాణం ఉంటుందని ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ తన మార్క్ ను చూపిస్తున్నారు. ఇప్పటికీ ఎన్నో రకాల ఆఫర్స్ ను ప్రకటిస్తూ ప్రయాణికులకు బస్సుల్లో ప్రయాణించేలా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే మరో ఆఫర్ తో ముందుకు వచ్చారు. ఇక నుంచి TSRTC బస్సుల్లో ఉచిత వైఫైని అందుబాటులోకి తీసుకు రానున్నట్లుగా ప్రకటించారు. కాగా మొదటి విడతలో భాగంగా త్వరలో 16 బస్సుల్లో ఉచిత వైఫైని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని బస్సుల్లో ఫ్రీ వైఫై అందుబాటులో ఉండడం విశేషం.
Wifi in TSRTC..
Every initiative contributes to the betterment of society.#TSRTC.
GAMYAM app link: https://t.co/oz9A95ALbI@SajjanarVC @tsrtcmdoffice @shilpavallik @TSRTCHQ pic.twitter.com/6457OYvAV3— Team Road Squad🚦🚴♀️ (@Team_Road_Squad) September 6, 2023