iDreamPost

ఏపీ హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులు! ఎవరంటే..

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఏపీ హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులు! ఎవరంటే..

శనివారం  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం జరిగింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నూతన న్యాయమూర్తుల చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ చేయించారు. నూతన న్యాయమూర్తులుగా  నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ ప్రమాణ స్వీకరం చేశారు. ఈ కార్యక్రమానికి  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్  సింగ్ ఠాకూర్ , సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాక ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, సీఎం జగన్‌తో పాటు నూతన న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, తదితరులు హాజరయ్యారు.

న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని జడ్జీలుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతికి సిఫారుసు చేశారు. కొలీజియం పంపిన సిపారుసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. కేంద్ర న్యాయశాఖ వీరి నియామకానికి అక్టోబరు 18న ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల సంఖ్యకు గానూ ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ  అయ్యారు. అలానే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నజస్టిస్‌ నరేందర్‌ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన నలుగురితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ జగడం సమతి ఉస్మానియా యునివర్సిటీ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. 2019లో జిల్లా మండల పరిషత్ లు, గ్రామ పంచాయతీలకు స్టాండింగ్ కౌన్సిల్ గా సేవలందించారు. 2020 నుంచి హైకోర్టులో జీపీగా సేవలు అందించారు. జస్టిస్ న్యాపతి విజయ్ 2012 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్ పర్యావరణ కేసుల్లో ఈయనకు పట్టు ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి