Somesekhar
ఆ ప్లేయర్ క్రికెట్ ఆడకపోవడం ప్రపంచ క్రికెట్ కే పెద్ద దెబ్బ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఆ ప్లేయర్ క్రికెట్ ఆడకపోవడం ప్రపంచ క్రికెట్ కే పెద్ద దెబ్బ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Somesekhar
వరల్డ్ క్రికెట్ లో ఎందరో దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. కానీ ఆ లెజెండ్స్ ఇష్టపడే క్రికెటర్లు మాత్రం కొందరే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా అలాంటి ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు సదరు మాజీ క్రికెటర్లు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ టీమిండియా స్టార్ ప్లేయర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడు క్రికెట్ ఆడకపోవడం భారత జట్టుకే కాక.. ప్రపంచ క్రికెట్ కు ఎంతో నష్టం అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు చూద్దాం.
టీమిండియా ఆటగాళ్లను విమర్శించడానికి ఎప్పుడు టైమ్ దొరుకుతుందా? ఎప్పుడెప్పుడు వారిపై మాటల యుద్దానికి దిగుదామా అని ఎదురుచూసే వారిలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఒకడు. కానీ విచిత్రంగా ఈసారి టీమిండియా ప్లేయర్ పై ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు అందుబాటులో లేకపోవడం ఇండియాకే కాకుండా.. ప్రపంచ క్రికెట్ కు నష్టం అని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ గత రెండు టెస్టులకు దూరం అయ్యాడు. నెక్ట్స్ మ్యాచ్ లకు కూడా దూరమయ్యే ఛాన్స్ లు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఈ విషయంపై స్పందించాడు. తాజాగా స్కై స్పోర్ట్స్ క్రికెట్ తో నాసిర్ హుస్సేన్ ఈ విధంగా మాట్లాడాడు.
“విరాట్ కోహ్లీ లాంటి మేటి ఆటగాడు క్రికెట్ ఆడకపోవడం టీమిండియాతో పాటుగా ఈ సిరీస్ కే గాక.. ప్రపంచ క్రికెట్ కు భారీ నష్టం. కోహ్లీ జట్టులోకి వస్తాడా? మిగతా మ్యాచ్ లు ఆడతాడా? అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఇలాంటి ప్లేయర్లను మేనేజ్ మెంట్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. కోహ్లీ గత 15 ఏళ్లుగా టీమిండియాకు సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం కుటుంబం కోసం కోహ్లీ విరామం తీసుకోవడం మంచిదే. కానీ అండర్సన్-కోహ్లీ మధ్య పోరు చూద్దామని ఆశపడిన వారికి మాత్రం నిరాశే ఎదురైంది” అంటూ చెప్పుకొచ్చాడు నాసిర్ హుస్సేన్. ఇదిలా ఉండగా టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ రాజ్ కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ప్రణాళికలను రచిస్తున్నాయి. మరి విరాట్ కోహ్లీపై నాసిర్ హుస్సేన్ వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Nasser Hussain said – “If Virat Kohli miss the remaining Test matches against England, there’ll be a big blow for Team India, for the series and it will be big blow for World Cricket”. (Sky Sports Cricket) pic.twitter.com/6wjHRYQgIW
— CricketMAN2 (@ImTanujSingh) February 8, 2024
ఇదికూడా చదవండి: Ishan Kishan: అందుకే జట్టుకు ఇషాన్ కిషన్ దూరం! వెలుగులోకి సంచలన నిజాలు