iDreamPost

Ishan Kishan: అందుకే జట్టుకు ఇషాన్ కిషన్ దూరం! వెలుగులోకి సంచలన నిజాలు

ఇషాన్ కిషన్ టీమిండియాకు దూరం కావడానికి మానసిక ఒత్తిడి కారణం కాదని, దానికి ఓ బలమైన రీజన్ ఉందని చెప్పుకొచ్చింది ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్.

ఇషాన్ కిషన్ టీమిండియాకు దూరం కావడానికి మానసిక ఒత్తిడి కారణం కాదని, దానికి ఓ బలమైన రీజన్ ఉందని చెప్పుకొచ్చింది ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్.

Ishan Kishan: అందుకే జట్టుకు ఇషాన్ కిషన్ దూరం! వెలుగులోకి సంచలన నిజాలు

ఇషాన్ కిషన్.. గత కొంతకాలంగా టీమిండియాలో బాగా వినిపిస్తున్నపేరు. సౌతాఫ్రికాతో టూర్ కు ముందు మానసిక ఒత్తిడి కారణంగా తనకు తానే విశ్రాంతి కావాలని మేనేజ్ మెంట్ కు చెప్పాడు. దీంతో వారుసైతం అతడి నిర్ణయాన్ని గౌరవించి రెస్ట్ ఇచ్చారు. కానీ మానసిక ఒత్తిడి అని విశ్రాంతి కోరిన ఇషాన్ అనూహ్యంగా దుబాయ్ లో ధోని, రిషబ్ పంత్ లతో కలిసి ఓ పార్టీలో కనిపించాడు. దీంతో అతడిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇషాన్ పై రకరకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలన న్యూస్ క్రికెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది. ఇషాన్ టీమిండియాకు దూరం అవ్వడానికి ప్రధాన కారణం ఇదే అంటూ ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.

టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా అతడు రెస్ట్ తీసుకుంటున్నాడు. కాగా.. ఉన్నట్లుండి పాండ్యా బ్రదర్స్ తో కలిసి గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు ఇషాన్. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. అయితే టీమిండియాలోకి రావాలంటే రంజీల్లో నిరూపించుకోవాలని సెలెక్టర్లు అతడికి తేల్చి చెప్పారు. కానీ ఇషాన్ వారి మాటలు పట్టించుకోవడం లేదు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మెుదలుపెట్టినట్లు సమాచారం. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఇషాన్ జట్టుకు దూరంగా ఉండటానికి అసలు కారణం వేరే ఉందని తాజాగా ఓ ప్రముఖ క్రికెట్ వెబ్ సైట్ బాంబ్ పేల్చింది.

తాను టీమ్ లో ఉండగా.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు జితేశ్ శర్మను ఎంపిక చేయడంతో ఇషాన్ అలిగాడట. పైగా టెస్ట్ సిరీస్ కు కేఎల్ రాహుల్ ఉండటంతో.. తనను ఎలాగో పక్కనపెట్టడం ఖాయమనే ఉద్దేశంతోనే అతడు ముందుగానే విశ్రాంతి కోరాడని రేవ్ స్పోర్ట్స్ పేర్కొంది. ప్రస్తుతం ఈ న్యూస్ క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియాకు అందుబాటులో లేకుండా తిరుగుతున్నాడు ఈ యంగ్ బ్యాటర్. దీంతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు కూడా ఈ యువ వికెట్ కీపర్ ను పక్కనపెట్టారు సెలెక్టర్లు. కాగా.. ఇంగ్లాండ్ సిరీస్ కు ఇషాన్ జట్టులోకి తీసుకుందామనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ అతడి మెుండి పట్టుదల వల్లే చివరికి ఇలా టీమ్ కు దూరమయ్యాడు. జితేశ్ శర్మను సెలెక్ట్ చేయడంతోనే ఇషాన్ అలిగాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: పాకిస్థాన్‌ను వణికించిన ఆసీస్‌ యువ బౌలర్‌! గాల్లో వికెట్ల డ్యాన్స్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి