iDreamPost

వీడియో: కొత్త స్కూటీకి గుడిలో పూజలు చేయించిన విదేశీ యువతి! భారతదేశ సంస్కృతికి..

  • Published Jun 05, 2024 | 2:58 PMUpdated Jun 05, 2024 | 2:58 PM

Mumbai, Maharashtra: భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడమే కాకుండా వాటిని ఆచరిస్తూ.. ఓ విదేశీ యువతి తన కొత్త స్కూటీకి పూజ చేయించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Mumbai, Maharashtra: భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడమే కాకుండా వాటిని ఆచరిస్తూ.. ఓ విదేశీ యువతి తన కొత్త స్కూటీకి పూజ చేయించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jun 05, 2024 | 2:58 PMUpdated Jun 05, 2024 | 2:58 PM
వీడియో: కొత్త స్కూటీకి గుడిలో పూజలు చేయించిన విదేశీ యువతి! భారతదేశ సంస్కృతికి..

సాధారణంగా మన దేశ సంస్కృతి, సంప్రదాయాల్లో.. ముఖ్యంగా మన తెలుగు ప్రజల్లో ఏదైనా ఒక వాహనం లేదా ఎలక్ట్రానిక్‌ వస్తువు కొన్నా.. పూజలు చేసి ప్రారంభిస్తారు. కొన్ని వస్తువులకు ఇంట్లోనే పూజలు చేస్తారు. కానీ, వాహనాలను మాత్రం గుడికి తీసుకెళ్లి.. పూజారితో ప్రత్యేకమైన వాహన పూజ చేయించి ఒక శుభ సమయంలో దాన్ని నడపడం ప్రారంభిస్తారు. అలా చేస్తే అంతా శుభమే కలుగుతుందని, ప్రమాదం బరిన పడకుండా ఉంటామనే నమ్మకం. అయితే.. ఇలాంటి నమ్మకమే ఇప్పుడు ఒక విదేశీ యువతిలో కూడా కలిగింది. మన దేశంలో ఉండటమే కాదు.. మన సంస్కృతి సంప్రదాయల గొప్పతనం, ప్రాముఖ్యత తెలుసుకుని వాటిని ఫాలో కూడా అవుతుంది.

తాజాగా ఓ యువతి తను కొనుగోలు చేసిన స్కూటీని నెట్టుకుంటూ గుడి వద్దకు తీసుకెళ్లి.. పూజారితో ప్రత్యేక పూజలు చేయించి మరీ.. స్కూటీని నడపడం ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. సాధారణంగా విదేశీయులు ఇలాంటి వాటిన నమ్మరని అంతా అంటూ ఉంటారు. కానీ, ఈ విదేశీ యువతి మాత్రం మన సంస్కృతి గౌరవిస్తూ.. వాహన పూజ నిర్వహించింది. ఈ పూజా కార్యక్రమం ముంబైలో జరిగినట్లు సమాచారం. ఈ స్కూటర్‌కు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ నంబర్ ప్లేట్ ఉంది. ముంబైలో ఉద్యోగం చేస్తున్న ఓ విదేశీ యువతి.. తన ఉండే చోటు నుంచి ఆఫీస్‌కు వెళ్లేందుకు స్కూటీని కొనుగోలు చేసింది. అయితే.. దాన్ని అలాగే నడపకుండా ప్రత్యేక పూజలు చేయింది.

అయితే.. విదేశీయులు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం అనుసరించడం ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా భారతీయ సంప్రదాయాలు, ఆచారాలను విదేశీలు గుర్తిస్తున్నారు. వాటిని అనుసరిస్తున్నారు కూడా. మన చేసే ప్రతి పని వెనుక సైన్స్‌ ఉందనే విషయాన్ని నిదానంగా విదేశీయులు గుర్తిస్తున్నారు. దాంతో మనం ఎలాగైతే కొన్ని పద్దతులు పాటిస్తామో వాళ్లు కూడా వాటిని అలానే చేస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయలను కొంతమంది మూఢనమ్మకమని ఎగతాళి చేస్తుంటారు. కానీ, ఈ యువతి మాత్రం మన నమ్మకాలను గౌరవించడమే ఆచరిచండం ఎంతో గొప్ప విషయం అంటూ ఈ వీడియోకి కామెంట్ల కూడా వస్తున్నాయి. వరి ఓ విదేశీ యువతి స్కూటీకి గుడిలో పూజలు చేయించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి