iDreamPost

ఎముకలు గట్టి పడాలంటే.. ఏమేమి తినాలి?.. ఆహారంలో ఎంత కాల్షియం ఉండాలి?

ఎముకలు గట్టి పడాలంటే.. ఏమేమి తినాలి?.. ఆహారంలో ఎంత కాల్షియం ఉండాలి?

ఈ మధ్య కాలంలో మనం చాలామందికి ఎముకలు విరిగాయి అని వింటున్నాము. వారిలో చిన్నపిల్లలు, పెద్దవారు, యువకులు అందరూ ఉంటున్నారు. ఇలా జరగడానికి కారణం ఎముకలు బలంగా లేకపోవడమే. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం. మనం రోజూ తినే ఆహారంలో మన వయసుకు సరిపడా కాల్షియం తీసుకోవాలి లేకపోతే మనకు ఏదయినా దెబ్బ తగిలినప్పుడు ఎముకలు విరుగుతాయి.

సంవత్సరం లోపు పిల్లలకు రోజుకు కనీసం 200 నుండి 260 మి.గ్రా. కాల్షియం అందించాలి. సంవత్సరం నుండి పది సంవత్సరాల వయసు గల పిల్లలకు 300 నుండి 1000 మి.గ్రా. వరకు కాల్షియం ఇవ్వాలి. టీనేజి పిల్లలకు రోజుకు 1300 మి.గ్రా. కాల్షియం ఇవ్వాలి. ఇరవై నుండి యాబై సంవత్సరాల వయసు ఉన్న వారు 1000 మి.గ్రా. పైగా కాల్షియం రోజూ తీసుకోవాలి. యాబై అంతకన్నా ఎక్కువ వయసు గల వారు రోజుకు 1200 మి.గ్రా. కాల్షియం ఆహరం రూపంలో తీసుకోవాలి. గర్భిణులు మరియు బాలింతలు రోజుకు 1300 మి. గ్రా. కాల్షియం తినాలి.

పాలల్లో 300 మి.గ్రా. కాల్షియం ఉంటుంది. కొన్ని రకాల ఆకుకూరల్లో కాల్షియం ఎక్కువగానే ఉంటుంది. మెంతికూర, తోటకూర 100g లో 397 మి. గ్రా. కాల్షియం, కరివేపాకు 100g తీసుకుంటే 830 మి. గ్రా. మరియు పొన్నగంటికూరలో 510 మి.గ్రా. కాల్షియం ఉంటుంది. నువ్వులు రోజుకు 100 గ్రాములు తీసుకుంటే 1450 మి. గ్రా. కాల్షియం లభిస్తుంది. కాబట్టి ఈవిధంగా మన ఆహారంలో రోజూ కాల్షియం ఎక్కువగా ఉండేలా చూసుకుంటే కాల్షియం లోపం లేకుండా ఎముకలు బలంగా ఉంటాయి.

 

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి