iDreamPost
android-app
ios-app

సత్తా చాటిన రైతు బిడ్డ… ఒకే సారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు!

సత్తా చాటిన రైతు బిడ్డ… ఒకే సారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు!

చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఉంటుంది. అయితే ఈరోజుల్లో సర్కారీ కొలువు పొందాలంటే మాటలు కాదు. నోటిఫికేషన్లు రావడమే తక్కువ, పోటీ చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ  క్రమంలోనే చాలా మంది కొన్ని ప్రయత్నాలు చేసి.. అందులో విఫలమైతే తీవ్ర నిరాశలోకి వెళ్తారు. కానీ కొందరు మాత్రం ఎన్ని సార్లు విఫలం చెందిన అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించరు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం అయితే  చాలు ఎలాంటి పోస్టయినా పర్వాలేదు అనుకున్నోల్లకే కొదవలేదు. కానీ, ఒక తెలుగు రైతు బిడ్డ ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేశాడు. తీవ్రమైన పోటీని తట్టుకొని ఏకంగా ఒకే సారి నాలుగు పరీక్షల్లో విజయం సాధించాడు. ఇంతకీ ఆ విజేత ఎవరు, అతడు ఎలా  4 ఉద్యోగాలు సాధించాడు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

విశాఖపట్నం జిల్లా యలమంచిలికి చెందిన కర్రి రఘనాథ్ శంకర్ అనే యువకుడు వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండే వాడు. శంకర్ తండ్రి కర్రి సత్యనారాయణ రైతు కాగా, తల్లి నాగమణి సాధారణ గృహిణి. రైతు కుటుంబంలో జన్మించిన శంకర్ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలో సాగింది. అతడికి చిన్నతనం నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరిక ఉండేది. ఆ దిశగానే తన అడుగులు వేశాడు.

తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూ స్థానిక  లైబ్రరీలో ఉన్న పుస్తకాలతో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యాడు. అతడు ప్రత్యేకించి ఎక్కడా శిక్షణ తీసుకోలేదు.  ఈక్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైన ఉద్యోగాలకు పరీక్షలు రాశాడు. ఈక్రమంలోనే ఒకటీ, రెండు కాదు ఏకంగా నాలుగు ఉద్యోగాలను సాధించాడు. అది కూడా ఎలాంటి కోచింగులు లేకుండానే ఈ ఘనత సాధించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో జైల్‌ వార్డన్స్, పోలీసు శాఖ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్ గా, ఇన్‌కమ్‌ టాక్స్, సీబీఐల్లో గ్రేడ్-బి ఉద్యోగాల కోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించిన పరీక్షల్లోనూ విజయం సాధించాడు. వీటితో పాటు రైల్వే కమర్షియల్‌ అప్రంటీస్‌ పోస్టుకోసం నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించాడు.

ప్రజలకు మంచి సేవలు అందించే లక్ష్యంతో తాను ఎస్‌ఐ పోస్టును ఎంచుకుంటున్నట్లు తెలిపాడు. ఏళ్ల తరబడి కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నంలో ఉన్న యువతకు రఘునాథ్ శంకర్ ఆదర్శంగా నిలిచారు. లైబ్రరీయే తన కోచింగ్‌ సెంటర్ అని, తన తల్లిదండ్రులు, నాన్నమ్మ ప్రోత్సాహంతో మామయ్యను ఆదర్శంగా తీసుకుని ఈ విజయం సాధించాను రఘనాత్ తెలిపాడు. మనిషి అనుకుంటే సాధించనదంటూ ఏమున్నదిని రైతు బిడ్డ రఘునాథ్ నిరూపించాడు. అతడిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. మరి.. ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఈ రైతు బిడ్డపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al