iDreamPost

తెలుగు చిత్రంతో అరంగేట్రం.. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుతో మెరిసింది!

తెలుగు చిత్రంతో అరంగేట్రం.. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుతో మెరిసింది!

సినీ ఇండస్ట్రీలో తమ వంతు సేవలు అందించిన నటీనటులకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఒకరికి అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే జీవిత సాఫ్యల అవార్డు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మద్యనే నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేటగిరిలో అలనాటి అందాల తార వహిదా రెహమాన్ కు దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది.

ఐదు దశాబ్దాల పాటు సినీ రంగానికి తన వంతు సేవలు అందించిన ప్రముఖ నటి వహిదా రహమాన్ కు అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు వరించింది. కేంద్ర ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ లో వహెదా రహమాన్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ పురస్కారాన్ని ప్రకటించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందంటూ అనురాగ్ ఠాకూర్ ట్విట్ చేశారు.

వహిదా రహమాన్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించింది. మొదట ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్ చేయాలని భావించారు.. కానీ అనుకోకుండా సినిమా ఛాన్సులు రావడంతో ఇండస్ట్రీలోనే కొనసాగారు. ఎన్టీఆర్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన ‘జయసింహ’మూవీలో నటించింది. కాకపోతే అంతకు ముందే నాగేశ్వరరావు నటించిన ‘రోజులు మారాయి’ మూవీలో ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా’ అనే పాటకు పల్లెటూరి పిల్లగా తన డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇదే ఆమె మొదటి చిత్రం అని చెప్పొచ్చు. కెరీర్ బిగినింగ్ తెలుగు ఇంస్ట్రీలో మొదలు పెట్టినా.. తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఆమె నటించిన చిత్రాలు కాగజ్ కా పూల్, షాగున్, ప్యాసా, చద్విన్ కి చాంద్, పత్తర్ కా శనమ్, ఖామోషీ, చాందిని, హిమ్మత్ వాలా, రంగ్ దే బసంతి ఇలా ఎన్న బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది. వహిదా రహమాన్ కెరీర్ లో దాదాపు వందకు పైగా చిత్రాల్లో హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. చివరిసారిగా ఆమె 2021 లో స్కెటర్ గర్ల్ మూవీలో కనిపించారు. 1971 లో రేష్మా ఔర్ షేరా మూవీలో నటించిన ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు వరించింది. 1972లో ‘పద్మశ్రీ’, 2011లో ‘పద్మభూషన్’ అవార్డులు అందుకున్నారు. వహెదా రహమాన్ కి దాదాసాహెబ్‌ ఫాల్కే జీవిత సాఫ్యల అవార్డు వరించడంతో సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి