iDreamPost

కోటీశ్వరుడైన గాడిదలను మేపే రైతు.. లీటర్ పాలు ఏకంగా రూ. 3 వేలు!

Donkey Milk Business: చిన్న ఉద్యోగం దొరికితే చాలు అనుకున్న వ్యక్తి.. రైతు గాడిదలను మేపుతూ కోటీశ్వరుడు అయ్యాడు. ఇవాళ ప్రపంచదేశాలకు గాడిద పాలను, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తూ ఎం,మిలియనీర్ గా నిలిచాడు.

Donkey Milk Business: చిన్న ఉద్యోగం దొరికితే చాలు అనుకున్న వ్యక్తి.. రైతు గాడిదలను మేపుతూ కోటీశ్వరుడు అయ్యాడు. ఇవాళ ప్రపంచదేశాలకు గాడిద పాలను, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తూ ఎం,మిలియనీర్ గా నిలిచాడు.

కోటీశ్వరుడైన గాడిదలను మేపే రైతు.. లీటర్ పాలు ఏకంగా రూ. 3 వేలు!

గుజరాత్ లోని పఠాన్ జిల్లాకు చెందిన ధీరేన్ సోలంకి అనే రైతు గాడిద పాలతో వ్యాపారం చేస్తూ నెలకు 3 లక్షలు దాకా సంపాదిస్తున్నాడు. గాడిద మిల్క్ ఫార్మ్ ని ఆన్ లైన్ బిజినెస్ గా మార్చడంతో లాభాల బాట పట్టాడు. లీటర్ గాడిద పాలను 3 వేలకు అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు అనుకుని అతను తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగాలు దొరక్కపోవడం, ప్రైవేట్ కంపెనీలు తక్కువ జీతం ఇస్తుండడం కారణంగా గాడిదల పెంపకంలోకి అడుగుపెట్టాడు. దక్షిణ ప్రాంతాల్లో గాడిదల పెంపకాన్ని సాగించాడు. 22 లక్షల పెట్టుబడితో 20 గాడిదలతో ఫార్మ్ ని స్టార్ట్ చేశాడు. 

సవాళ్లు – విజయాలు:

అయితే ప్రారంభంలో సోలంకి అనేక సవాళ్ళను ఎదుర్కున్నాడు. గుజరాత్ లో గాడిద పాలకు పెద్ద డిమాండ్ లేదు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో గాడిద పాలకు డిమాండ్ ఉంటుందని తెలుసుకుని సౌత్ పై ఫోకస్ పెట్టాడు. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు సోలంకి గాడిద పాలను సరఫరా చేస్తున్నాడు. కాస్మొటిక్ కంపెనీలకి కూడా ఆయన గాడిద పాలను, గాడిద పాల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాడు. ఆన్ లైన్ లో గాడిద పాలను విక్రయించాలని సొంతంగా వెబ్ సైట్ ని రూపొందించాడు. టీడీఎస్ డాంకీ ఫార్మ్ డాట్ ఇన్ పేరుతో వెబ్ సైట్ పెట్టి అందులో గాడిద పాలను విక్రయిస్తున్నాడు. డాంకీ మిల్క్ పౌడర్, పాలతో పాటు గాడిదలను కూడా విక్రయిస్తున్నాడు. దీంతో అతని బిజినెస్ మరింత విస్తరించింది.

డిమాండ్ పెరగడంతో గాడిద పాల ధరను పెంచేశాడు. లీటర్ గాడిద పాలను 3 వేలకు విక్రయిస్తున్నాడు. 5 లీటర్ల చొప్పున 15 వేలకు విక్రయిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా గాడిద పాలను, గాడిద పాల పౌడర్ ను విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. మిల్క్ పౌడర్ ని అయితే ఏకంగా 40 వేల నుంచి 4 లక్షలకు విక్రయిస్తున్నాడు. 250 గ్రాములు, 500 గ్రాములు, 1000 గ్రాములు చొప్పున విక్రయిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో 38 లక్షల పెట్టుబడితో 42 గాడిదలతో తన ఫార్మ్ ని విస్తరించాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు కోసం, గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నాడు.

గాడిద పాలతో కలిగే ప్రయోజనాలు:

గాడిద పాలతో ఆర్థిక ప్రయోజనాలే కాకుండా పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మహిళలు ఇచ్చే పాలకు దగ్గరగా ఈ గాడిద పాలు ఉండడం.. ఆవు పాలంటే అలర్జీ ఉండే శిశువులకు గాడిద పాలు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. పలు స్టడీస్ ప్రకారం.. పేగు మైక్రోఫ్లోరాని నియంత్రించడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం, యాంటీ బయాటిక్ లక్షణాలు వంటివి గాడిద పాలలో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి