iDreamPost

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం మృతి!

Attili Anantharam Passed away: ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో అటు వారి కుటుంబ సభ్యులు.. ఇటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

Attili Anantharam Passed away: ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో అటు వారి కుటుంబ సభ్యులు.. ఇటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం మృతి!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు.. ఇతర రంగానికి చెందిన వారు కన్నమూస్తున్నారు. వయోభారం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల కన్నుమూస్తున్నారు. ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వరరావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీర భద్రరావు గత నెల కన్నుమూశారు. కోలీవుడ్ స్టార్ నటుడు డేనియల్ బాలాజీ చిన్న వయసులోనే కన్నుమూశారు. పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన మాలీవుడ్ నటుడు సుజిత్ రాజేంద్రన్ చికిత్స పొందుతూ చనిపోయారు. నిన్న తమిళ నటుడు సింహం మూవీ ఫేమ్, అన్నాడీఎంకే స్టార్ స్పీకర్ అరుళ్మణి గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదం మరువక ముందే.. మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో డబ్బింగ్, వాయిస్ ఆర్టిస్ట్ అత్తిలి అనంతరాం శనివారం అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. సుమారు 40 ఏళ్లకు పైగా ఆక్ష్న ఈ రంగంలో సేవలు అందిస్తున్నారు. ఎన్నో వందల యాడ్స్, కార్పోరేట్ ఫిలిమ్స్ కి వాయిస్ ఇవ్వడం తో పాటు స్క్రిప్ట్ అందించారు. అమిగాబచ్చన్, సచిన్, మహేష్ బాబు వంటి బిగ్గెస్ట్ సెలబ్రెటీలతో పాటు అనేక బాలీవుడ్ స్టార్లకు ప్రకటనలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. 2012 లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించిన పాటను తెలుగు లో రాయడమే కాదు.. స్వయంగా తానే పాట పాడటం విశేషం. చాలా వరకు నేషనల్, ఇంటర్నేషనల్ యాడ్ ఏజన్సీలు ఎక్కువతా దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై లో ఉంటాయి.

ముంబైలో తెలుగు వాయిస్, రైటర్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకున్న ఆయన 40 ఏళ్ల పాటు ఇదే రంగంలో ఉంటూ వచ్చారు. మొదటి నుంచి తెలుగు అంటేఎంతో ఇష్టంతో ఉండే అనంతరాం హైదరాబాద్ లో తెలుగు కి సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా తప్పకుండా హాజరయ్యేవారున అని సన్నిహితులు చెబుతున్నారు. తెలుగు అడ్వర్టైంజింగ్‌ రంగంలో ఎంతో గొప్ప పాపులారిటీ సంపాదించిన అత్తిలి అనంతరాం కన్నుమూయడం పట్ల ప్రముఖులు ఆయనకు ఘన నివాళలు అర్పించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి