iDreamPost

కోడిగుడ్డుపై ఈకలు పీకకండి.. దిల్ రాజు స్ట్రాంగ్ కౌంటర్!

Dil Raju Strong Counter: విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ జంటగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాకి వరల్డ్ వైడ్ గా సూపర్ టాక్ వస్తోంది. ఈ మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసింది.

Dil Raju Strong Counter: విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ జంటగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాకి వరల్డ్ వైడ్ గా సూపర్ టాక్ వస్తోంది. ఈ మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసింది.

కోడిగుడ్డుపై ఈకలు పీకకండి.. దిల్ రాజు స్ట్రాంగ్ కౌంటర్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. సంక్రాంతికి రావాల్సిన సినిమాని ఇప్పటి దాకా ఆపారని ఫ్యాన్స్ లో కాస్త అసంతృప్తి ఉండేది. కానీ, ఈ మూవీ చూసిన తర్వాత ఆ వెయిటింగ్ కి తగ్గ సినిమాని అందించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మృణాళ్ ఠాకూర్, దిల్ రాజు, పరశురామ్ కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ దిల్ రాజు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. కోడిగుడ్డు మీద ఈకలు పీకద్దు అంటూ హితవు పలికారు.

ది ఫ్యామిలీ స్టార్ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ స్టార్ట్ కాకుండానే థియేటర్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసేసింది. ప్రొడ్యూసర్, హీరోయిన్, డైరెక్టర్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మూవీకి సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పారు. అయితే ఒక రిపోర్టర్ సినిమాకి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారు. అలాగే కథ విషయంలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు. వాటికి దిల్ రాజు సమాధానాలు చెప్పారు. అంతేకాకుండా ఒకానొక పాయింట్ లో స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు.

మొదట సాంగ్ ఎండ్ టైటిల్స్ లో పెట్టడంపై ప్రశ్నించగా.. “డైరెక్టర్ సాంగ్ తీశాడు. దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, ఆ పాటను మధ్యలో పెడితే మూవీ ఫ్లో పోతుంది అన్నాడు. కానీ, సాంగ్ ని ఆడియన్స్ కి అందించాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఆ పాటను లాస్ట్ లో పెడదామని చెప్పాడు. పైగా అక్కడ కూడా సందర్భం ఉంది. అందుకే లాస్ట్ లో పెట్టాం” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. అమెరికా ఎందుకు తీసుకెళ్లారు? మిడిల్ క్లాస్ అబ్బాయిని సూపర్ మ్యాన్ గా చూపించారు అంటూ ప్రశ్నలు వేయగా.. దిల్ రాజు ఆయనదైన శైలిలో సమాధానం చెప్పారు.

“విలన్ బట్టి హీరో ఉంటాడు కదా? రెండు జిల్లాల మనుషులు వచ్చినప్పుడు హీరో కొట్టకపోతే ఎలా? హీరో అన్నాక హీరో పని చేయాలి కదా. ఇన్ని సినిమాలు చూశాం. ఒక ఫైట్ వస్తుంది. హీరో ఒక 20 మందిని కొడతాడు.. రియల్ లైఫ్ లో కొట్టగలుగుతామా? యాక్షన్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే కాదా. అది సినిమా.. మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఎందుకు? అది ఎమోషన్.. ఎమోషన్ కి కనెక్ట్ అయితే లాజిక్స్ ఉండవు. ఎమోషన్ కి కనెక్ట్ కాకపోతేనే లాజిక్స్ ఉంటాయి” అంటూ దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి