iDreamPost

క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!

క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!

టాలీవుడ్‌ టు హాలీవుడ్‌ క్యాస్టింగ్‌ కౌచ్‌ లేని సినిమా ఇండస్ట్రీనే లేదు. ప్రతీ ఇండస్ట్రీలోని నటీమణులు ఏదో ఒక సందర్భంలో క్యాస్టింగ్‌ కౌచ్‌కు గురవుతున్నారు. మీటు ఉద్యమం మొదలైన తర్వాత తమ క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాల గురించి వారు బయటకు చెబుతూ ఉన్నారు. బాలీవుడ్‌లో రాధికా ఆప్టే, స్వరభాస్కర్‌, కంగనా రనౌత్‌ చాలా గట్టిగా.. క్యాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా తమ గళం వినిపించారు. తమ సినిమా జీవితంలో ఎదురైన అనుభవాలను బాహాటంగానే చెప్పారు. తాజాగా, ఈషా గుప్త ఈ జాబితాలోకి చేరిపోయారు.

బాలీవుడ్‌లో తనకెదురైన క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని బయటపెట్టారు. ఈషా గుప్త తన అనుభవం గురించి మాట్లాడుతూ.. ‘‘ నేను ఓ సినిమా కోసం షూటింగ్‌ చేస్తూ ఉన్నాను. సినిమా సగం పూర్తయింది. అలాంటి సమయంలో సినిమా సహ నిర్మాత తన కోరిక తీర్చమని నన్ను అడిగాడు. నేను కుదరదు అన్నాను. అప్పుడు నన్ను సినిమాలోంచి తీసేశారు. తర్వాత చాలా ఆఫర్లను కోల్పోయాను. ‘‘ నువ్వు మాకు సహాయపడకపోతే.. సినిమాల్లో ఉండి ఏం లాభం’’ అని నా గురించి వాళ్లు అన్నట్లు నాకు తెలిసింది.

మరో సంఘటనలో.. నేను అవుట్‌డోర్‌ షూటింగ్‌లో ఉన్నాను. సినిమాకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు నన్ను ట్రాప్‌ చేయడానికి ప్రయత్నించారు. నన్ను వాళ్ల రూములోకి వచ్చి పడుకోమన్నారు. కానీ, నేను ఒప్పుకోలేదు. నా మేకప్‌ ఆర్టిస్ట్‌ రూములోకి వెళ్లి పడుకున్నాను. పని కోసం.. మేం ఏదైనా చేస్తామని వాళ్లు అనుకుంటున్నారు’’ అని అన్నారు. మరి, నటి ఈషా గుప్త క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.