iDreamPost

చందాదారులకు షాకిస్తూ.. EPFO కీలక నిర్ణయం

EPFO On Advance Withdrawal: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ నగదు విత్ డ్రాల్స్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో చందాదారులకు షాకిచ్చినట్లు అయ్యింది.

EPFO On Advance Withdrawal: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ నగదు విత్ డ్రాల్స్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో చందాదారులకు షాకిచ్చినట్లు అయ్యింది.

చందాదారులకు షాకిస్తూ.. EPFO కీలక నిర్ణయం

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(EPFO) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కరోనా వేళ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగులు తమ రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్ నుంచి కూడా అడ్వాన్స్ ను తీసుకోవచ్చు. 2020లో తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి తాజాగా ఈపీఎఫ్ఓ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కోవిడ్ అడ్వాన్స్ పేరిట రిటైర్మెంట్ ఫండ్ నుంచి నగదును విత్ డ్రా చేసుకునే ఆప్షన్ ను తొలగించింది. ఇకపై ఏ ఉద్యోగి కూడా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అకౌంట్ కోవిడ్ అడ్వాన్స్ పేరుతో రిటైర్మెంట్ ఫండ్ నుంచి నగదును విత్ డ్రా చేసుకోవడం కుదరదు.

వారం రోజుల క్రితమే ఈపీఎఫ్ఓ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. కరోనా వేళ ఉద్యోగుల ఆరోగ్యం, చికిత్స కోసం మనీ విత్ డ్రా ఆప్షన్స్ లో మార్పులు చేసింది. 2020లో ఈ కోవిడ్ అడ్వాన్స్ ఆప్షన్ ను తీసుకొచ్చారు. అప్పటి నుంచి 2.2 కోట్ల మంది చందాదారులు ఈ ఆప్షన్ ను వినియోగించుకున్నారు. ఈ అడ్వాన్స్ పేరిట రూ.48 వేల కోట్లను విత్ డ్రా చేసుకున్న విషయం వార్షిక నివేదిక ద్వారా వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ కోవిడ్ అడ్వాన్స్ ని ఉమాంగ్ యాప్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అందులో కోవిడ్ అడ్వాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రస్తుతం ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సర్వీస్ అందుబాటులో లేదు అంటూ చూపిస్తోంది. హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి కోవిడ్-19 పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలగించిన నేపథ్యంలోనే ఈపీఎఫ్ఓ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చందాదారులు తమ ఈపీఎఫఓ ఖాతా నుంచి నాన్ రిఫండబుల్ కింద్ కోవిడ్ అడ్వాన్స్ ని తీసుకునేందుకు వీలు పడదు.

ఈ నిర్ణయాన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు. నిజానికి ఈపీఎఫ్ఓ ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకోవాల్సిందని చెబుతున్నారు. ఈ అడ్వాన్స్ పేరిట చాలామంది అనవసరపు కొనుగోళ్లు, విలాసాల కోసం రిటైర్మెంట్ సేవింగ్స్ ని వృథా చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఈ అడ్వాన్స్ ఆప్షన్ తీసుకొచ్చిన 2020-2021 సంవత్సరంలో 6.92 మిలియన్ ఖాతాదారులు రూ.17,106 కోట్లకు పైగా విత్ డ్రా చేశారు.2021-2022 ఏడాదిలో 9.16 మిలియన్స్ చందాదారులు రూ.19,126 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. ఇంక 2022-2023 సంవత్సరంలో అయితే 6.20 మిలియన్స్ ఖాతాదారులు తమ అకౌంట్స్ నుంచి రూ.11,843 కోట్లకు పైగా విత్ డ్రా చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఆర్థిక నిపుణులు ఆహ్వానిస్తున్నా.. చందాదారులకు మాత్రం రుచించడం లేదు. అడ్వాన్స్ ఆప్షన్ ను అందుబాటులో ఉంచితేనే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు చందాదారుల్లో కూడా కొందరు ఈపీఎఫ్ఓ సరైన నిర్ణయం తీసుకుంది అంటూ ప్రశంసిస్తున్నారు. మరి.. అడ్వాన్సుల విషంయోల ఈపీఎఫ్ఓ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి