iDreamPost

ఇంగ్లాండ్ ఊచ‌కోత‌, 50ఓవ‌ర్ల‌లో 498 ర‌న్స్, కొత్త వ‌ర‌ల్డ్ రికార్డు

ఇంగ్లాండ్ ఊచ‌కోత‌, 50ఓవ‌ర్ల‌లో 498 ర‌న్స్, కొత్త వ‌ర‌ల్డ్ రికార్డు

50 ఓవ‌ర్లు పాటు క్రికెట్ హైలెట్స్ మాత్ర‌మే చూస్తే ఎలాగ ఉంటుంది? ఎంపైర్లు ఎత్తిన చేతులు దింప‌కుండా ఫోర్లూ సిక్స‌లకు చేతులు ఊపుతూనే ఉంటే? వ‌చ్చిన బ్యాట్సెమెన్ వ‌చ్చిన‌ట్లుగా, వీర‌విహారం చేస్తుంటే? మైదానంలో ఆట‌గాళ్లు, స్టేడియంలో ప్రేక్ష‌కులు అలా ఫోర్లు, సిక్స‌ర్లు చూస్తే ఎలాగుంటుంది? అదే నెద‌ర్లాండ్స్ తో ఫ‌స్ట్ వ‌న్డే ఆడుతున్న‌ ఇంగ్లాండ్ బ్యాటింగ్. వోల్డ్ రికార్డులు బ‌ద్ధ‌లైయ్యాయి. ఫిల్ సాల్ట్, డేవిడ్ మ‌లాన్, జోస్ బట్ల‌ర్లు సెంచెరీలు కొడితే, ఐపీఎల్ లో ఆడేసుకున్న లివింగ్ స్టోన్, ఆఫ్ సెంచ‌రీ బాదాడు. బౌల‌ర్లో ఒక‌రు సెంచ‌రీ స‌మ‌ర్పించుకున్నాడు.

నెద‌ర్లాండ్స్ టూర్ కెళ్లిన ఇంగ్లాండ్ మొద‌టినుంచి 50ఓవ‌ర్ల‌లో 500 రన్స్ కొట్టాల‌న్న‌ట్లుగానే ఇన్నింగ్స్ మొద‌లుపెట్టింది. ఫ‌స్ట్ బాల్ కే జాస‌న్ రాయ్ అవుట్ అయినా, రెండోవైపు నుంచి బాదుడు మొద‌లైంది. ఫిల్ పాల్ట్( Phil Salt) 93 బాల్స్ లో 122 ర‌న్స్ కొట్టాడు. నెద‌ర్లాండ్స్ అంటే యావ‌రేజ్ టీం. అంద‌కే ప్ర‌తిబాల్ ను ఫోర్ కొట్టాల‌న్న‌ట్లుగానే ఫిల్ ఆడాడు. డేవిడ్ మ‌లాన్ కూడా అదే ధాటితో 109 బాల్స్ లో 125 ర‌న్స్ కొట్టాడు. ఆ త‌ర్వాత మొద‌లైంది బ‌ట్ల‌ర్ దూకుడు. వ‌ర‌స‌పెట్టి కొడుతూనే ఉన్నాడు. ఫోర్లు త‌గ్గాయి…సిక్స‌ర్లు పెరిగాయి. ఒక ద‌శ‌లో డ‌బుల్ సెంచెరీకి ఛాన్స్ ఉంద‌నిపించింది. కాని అత‌ని స్టైయిక్ ఇవ్వ‌కుండా లివింగ్ స్టోరీ వీర ఉతుకు ఉతికాడు. 70 బాల్స్ లో 7ఫోర్లు, 43 సిక్స‌ర్ల‌తో బ‌ట్ల‌ర్ 162 సాధిస్తే, లివింగ్ స్టోరీ 22 బాల్స్ లోనే, 6 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో 66 ర‌న్స్ కొట్టాడు. నెద‌ర్లాండ్స్ కు హార్డ్ హిట్టింగ్ ఏంటో మాస్ట‌ర్ క్లాస్ తీసుకున్నారు. డెత్ ఓవ‌ర్ల‌లో పీడ‌క‌ల చూపించారు. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 498 ర‌న్స్ చేసింది. వ‌న్డే క్రికెట్ లో తొలిసారి 500 ర‌న్స్ సాధిస్తుంద‌ని ఆశించారు కాని, రెండు ప‌రుగుల త‌క్కువైయ్యాయి. ఇదో వోల్డ్ రికార్డు.

వ‌న్డే క్రికెట్ లో ఇదో ఊచ‌కోత‌. క‌నీవినీ ఎరుగని హార్డ్ హిట్టింగ్. షార్ట్ బాల్, స్లో బ్లాల్, స్పిన్…అదీ ఇదీ అని తేడాలేదు. వ‌చ్చే బౌల‌ర్ ఎవ‌రో ముఖంకూడా చూడలేదు. బాల్ ప‌డగానే స‌ర్ర‌ని త్రాచుపాములా బ్యాట్ పైకి లేచింది. ఇది మ్యాచా? లేదంటే ప్రాక్టీస్ మ్యాచా? తేడా తెలియ‌లేదు. ప్ర‌తిబాల్ నూ చిత‌క్కొట్టారు. క‌నీసం డ‌జను సార్లు బాల్ పోయింది. లాగిపెట్టి కొడితే గ్రౌండ్ దాటి చాలా బాల్స్ ప‌డ్డాయి. 50ఓవ‌ర్ల‌పాటూ టీట్వింటీ క్రికెటే. 36 ఫోర్లు, 26 సిక్స‌ర్లు కొట్టారు. ఫ‌స్ట్ బాల్ నుంచి కొట్ట‌డం మొద‌లుపెడితే స్కోరింగ్ ఎలాగ ఉంటుందో, వోల్డ్ క్రికెట్ లో హిట్టింగ్ కు ఇంగ్లాండ్ పెట్టింది పేరు ఎందుకో మ‌రోసారి చూపించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి