iDreamPost

క్రికెట్ ప్రపంచంలో విషాదం.. స్పిన్ దిగ్గజం కన్నుమూత!

ప్రపంచ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యల కారణంగా దిగ్గజ స్పిన్నర్ కన్నుమూశారు.

ప్రపంచ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యల కారణంగా దిగ్గజ స్పిన్నర్ కన్నుమూశారు.

క్రికెట్ ప్రపంచంలో విషాదం.. స్పిన్ దిగ్గజం కన్నుమూత!

ప్రపంచ క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా ఇంగ్లండ్ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్ వుడ్(78) కన్నుమూశారు. తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో సిద్ధహస్తుడు ఎరిక్. అతడి ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇప్పటికీ అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ స్పిన్ బౌలర్ గా డెరిక్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇంగ్లండ్ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్ వుడ్ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా ఏప్రిల్ 15(సోమవారం) తుదిశ్వాస విడిచాడు. డెరిక్ ఇంగ్లండ్ తరఫున 1966-82 మధ్య ఆడాడు. తన కెరీర్ లో 86 టెస్టులు ఆడి 297 వికెట్లు పడగొట్టాడు. కౌంటీ క్రికెట్ లో డెరిక్ తిరుగులేదనే చెప్పాలి. కౌంటీల్లో 900కు పైగా మ్యాచ్ లు ఆడి 2523 వికెట్లు పడగొట్టడం విశేషం. 17 ఏళ్ల నుంచే డొమెస్టిక్ క్రికెట్ ప్రారంభించిన డెరిక్.. 25 సంవత్సరాల్లోపే వెయ్యి వికెట్లు పడగొట్టి రికార్డుల్లోకి ఎక్కాడు. కెంట్ టీమ్ తరఫున ఒకే సీజన్ లో 100కు పైగా వికెట్ల ఘనతను 10 సార్లు సాధించడం గమనార్హం. డెరిక్ ఘనతను గుర్తించిన ఐసీసీ 2009లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించింది. 2006లో డెరిక్ ఎంసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. డెరిక్ మరణంతో కెంట్ క్రికెట్ కు, వారి కుటుంబానికి తీరని లోటు అని క్లబ్ ప్రస్తుత అధ్యక్షుడు సైమన్ ఫిలిప్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి