iDreamPost

EV కొనాలని చూస్తున్నారా? బడ్జెట్‌లో బెస్ట్ EV వచ్చేసింది

మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికిల్ కొనాలని చూస్తున్నారా? అయితే బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఈవీ వచ్చేసింది. తాజాగా ఈవీ తయారీ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.

మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికిల్ కొనాలని చూస్తున్నారా? అయితే బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఈవీ వచ్చేసింది. తాజాగా ఈవీ తయారీ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.

EV కొనాలని చూస్తున్నారా? బడ్జెట్‌లో బెస్ట్  EV వచ్చేసింది

ఎలక్ట్రిక్ వాహనాలకు వస్తున్న ఆధరణతో టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కొత్త కంపెనీలు కూడా ఈవీ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అద్భుతమైన ఫీచర్లు, డిజైన్ తో ఈవీలను తయారు చేసి మార్కెట్ లోకి వస్తున్నాయి. ధర కూడా తక్కువగా ఉండడంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనేందుకు వాహనదారులు ఇంట్రస్టు చూపిస్తున్నారు. తాజాగా మరో కంపెనీ లేటెస్ట్ ఫీచర్లతో ఈవీని విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ జితేంద్ర ఎలక్ట్రిక్‌ ప్రిమో సిరీస్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేసింది. ప్రిమో ఎస్, ప్రిమో ప్లస్ రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ లభించనుంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. నిర్వహణ ఖర్చులు తగ్గడం, పొల్యూషన్ ప్రభావం కూడా లేకపోవడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. కాగా జితేంద్ర ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ విడుదల చేసిన ప్రిమో ఎస్, ప్రిమో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రారంభ ధర రూ. 79,999. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు సింగిల్ ఛార్జ్ తో ప్రిమో ఎస్ 82 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ప్రిమో ప్లస్ సింగిల్ ఛార్జ్ తో 137 కి.మీలు ప్రయాణించొచ్చు. గంటకు 52 కి.మీల వేగంతో ప్రయాణించగలవు. ఈ స్కూటర్ లో బ్యాటరీలను రిమూవబుల్ మోడ్ లో అందించారు. ఐపీ67 ప్రొటెక్షన్ తో వస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్ల విషయానికి వస్తే.. డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ ఇన్స్ట్రుమెంటెడ్ క్లస్టర్, రేంజ్ ప్రిడిక్షన్ ఫీచర్, యూఎస్బీ మొబైల్ ఛార్జింగ్ ఎల్ఈడీ ల్యాంప్స్, సైడ్ స్టాండ్ సెన్సార్, థర్మల్ ప్రమోషన్ అలర్ట్, రివర్స్ అసిస్టెన్స్ వంటి హైటెక్ యాడ్-ఆన్స్‌ ఈ స్కూటర్‌లో అందించారు. 2.04 కేడబ్య్లూహెచ్, 3.26 బ్యాటరీ ఆప్షన్స్‌తో ఈ స్కూటర్‌ రానుంది. లిథియం అయాన్ బ్యాటరీని పొందుపరిచారు. తక్కువ ధరకే ఈవీ కాావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఈవీలకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి