iDreamPost

OTTలోకి ఈగల్‌.. ఇంత తొందరగా వచ్చే ఛాన్స్ ఉందా?

  • Published Feb 23, 2024 | 4:39 PMUpdated Feb 24, 2024 | 12:30 PM

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం "ఈగల్". తాజాగా ఈ చిత్రం థియేటర్ లో మంచి కల్లెక్షన్లనే రాబట్టింది. అయితే, ఇప్పటి సినిమాలు థియేటర్ లో విడుదల కాకముందే ఓటీటీ పార్టనర్స్ ను ఫిక్స్ అవుతున్న క్రమంలో.. ఈగల్ ఓటీటీ గురించి మాత్రం ఇంత వరకు ఎటువంటి టాక్ రాలేదు. ఆ కారణాలు ఇలా ఉన్నాయి.

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం "ఈగల్". తాజాగా ఈ చిత్రం థియేటర్ లో మంచి కల్లెక్షన్లనే రాబట్టింది. అయితే, ఇప్పటి సినిమాలు థియేటర్ లో విడుదల కాకముందే ఓటీటీ పార్టనర్స్ ను ఫిక్స్ అవుతున్న క్రమంలో.. ఈగల్ ఓటీటీ గురించి మాత్రం ఇంత వరకు ఎటువంటి టాక్ రాలేదు. ఆ కారణాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 23, 2024 | 4:39 PMUpdated Feb 24, 2024 | 12:30 PM
OTTలోకి ఈగల్‌.. ఇంత తొందరగా వచ్చే ఛాన్స్ ఉందా?

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై .. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన సినిమా “ఈగల్”. రవితేజ హీరోగా, కావ్య థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్యన ఈ సినిమా ఈ నెల 9న .. తెలుగు,హిందీ, కన్నడ, మలయాళ ,తమిళ భాషలలో .. థియేటర్లలో విడుదల అయింది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందు .. చిత్ర బృందం ఈ మూవీ గురించి భారీగా ప్రమోషన్స్ చేసింది. ఆ సమయంలో ఎక్కడ చూసినా ఈగల్ మూవీపై క్రియేట్ చేసిన హైప్ ఏ కనిపించింది. అయితే ఈ మధ్య కాలంలో విడుదల చేసిన సినిమాలన్నీ.. దాదాపు థియేటర్ ఎంట్రీకి ముందుగానే ఓటీటీ పార్టనర్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నాయి. కానీ, ఈగల్ సినిమా ఓటీటీ గురించి మాత్రం ఇంతవరకు ఎక్కడ ఏ టాపిక్ రాలేదు. మరి, ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ అండ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యాయా !.. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అయితే ఈగల్ సినిమా థియేటర్ లో విడుదల కాకముందు .. కొన్ని కంప్లికేషన్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత చిత్ర బృందం చాలా చోట్ల ఈగల్ మూవీ ప్రమోషన్స్ ను భారీగా చేయడంతో.. పోను పోను ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. మొదటి రోజు మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నా .. పోను పోను యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. దీనితో కలెక్షన్లు కూడా బాగానే పెరిగాయి. అయితే, దాదాపు అంతటా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా.. ఇంతవరకు ఓటీటీ డీల్ మాత్రం క్లోజ్ అవ్వలేదు. దీనితో అందరికి ఇప్పుడు ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

గతంలోనూ కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలకు కూడా ఇలానే జరిగింది. థియేటర్ లో విడుదలైన ఎన్నో నెలల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇచ్చాయి కొన్ని సినిమాలు. అయితే, ప్రస్తుతం ఈగల్ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు క్లోజ్ అయినట్లే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ. 60 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కాబట్టి త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈగల్ మూవీ మేకర్స్ ఈటీవీ విన్ తో డీల్ కుదుర్చుకున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇక ఆ డీల్ కనుక ఓకే అయితే, ఈగల్ మూవీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి .. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. మరి, ఈగల్ మూవీ ఓటీటీ ఎంట్రీ అప్ డేట్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి