iDreamPost

నాలుగేళ్ళ తర్వాత రేగుతున్న గాయం

నాలుగేళ్ళ తర్వాత రేగుతున్న గాయం

నాలుగు సంవత్సరాల తర్వాత డ్రగ్స్ కేసు మళ్ళీ తెరపైకి రావడం టాలీవుడ్ ని కుదిపేస్తోంది. అప్పుడెప్పుడో విచారణ పేరుతో సెలబ్రిటీలను ఈడి ఆఫీస్ కు పిలవడం తర్వాత సదరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బదిలీ కావడం లాంటి పరిణామాల తర్వాత అందరూ ఆ సంగతిని మర్చిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా ఇది ఇంకోసారి మొదలుకావడం షాక్ కలిగిస్తోంది. తాజాగా మరోసారి తమ ముందు హాజరు కావాలని కొందరు ప్రముఖులకు నోటీసులు వెళ్లడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విచారణ ఆగస్ట్ 31 నుంచి మొదలై సెప్టెంబర్ మూడో వారం దాకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

నోటీసులు అందుకున్న వారిలో పూరి జగన్నాధ్ , రానా, రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ, ఛార్మీ, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, నందూ, తరుణ్ లు ఉన్నారు. దీని కోసం నియమింపబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటికే పదుల సంఖ్యలో వీళ్ళ నుంచి సాంపుల్స్ గతంలోనే సేకరించింది. కానీ వాటి తాలూకు ప్రోగ్రెస్ ని బయట పెట్టిన దాఖలాలు లేవు. అసలు ఇంత ఆలస్యంగా ఇదంతా ఇప్పుడు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఇక డేట్ల సంగతి చూస్తే పూరికి ఆగస్ట్ 31, సెప్టెంబర్ లో ఛార్మీని 2, రకుల్ 6, రానా 8, రవితేజ 9, నవదీప్ 13, ముమైత్ 15, తనీష్ 17, నందు 20, తరుణ్ 22 తేదీలను ఈడి ఇచ్చారు. వీటిలో మార్పులు ఉండొచ్చు.

సెకండ్ లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు అంతా కుదుటపడుతూ షూటింగులు రిలీజులతో చాలా సందడిగా మారిన టాలీవుడ్ ఇదంతా ఆందోళన కలిగించేదే. ఇప్పుడైనా అసలు నిజాలు బయటికి వస్తాయా లేక మునుపటి లాగా ఓ రెండు నెలలు హడావిడి చేసి సైలెంట్ అవుతారా అనేది వేచి చూడాలి. తప్పు ఉందో లేదో తేల్చేస్తే సదరు హీరో హీరోయిన్లకే కాదు వాళ్ళ అభిమానులకు కూడా రిలీఫ్ గా ఉంటుంది. అంతే తప్ప ఇలా వ్యవహారం నాన్చుతూ ఉంటే ఇబ్బందులు పెరుగుతూనే ఉంటాయి. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగక తప్పదు సస్పెన్స్ సినిమాలో అసలు ట్విస్టులాగా

Also Read : కీర్తి సురేష్ సినిమా ఏమైంది ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి