iDreamPost
android-app
ios-app

28 వేల ఫోన్లు, 20 లక్షల సిమ్ కార్డులపై బ్యాన్.. ఇలా చేయకపోతే మీకు నష్టం తప్పదు

  • Published May 15, 2024 | 10:06 PMUpdated May 15, 2024 | 10:06 PM

కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం కారణంగా.. 28 వేల స్మార్ట్ ఫోన్లు, 20 లక్షల సిమ్ కార్డులు బ్యాన్ కి గురి కానున్నాయి. కేంద్రం కొత్తగా రీవెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించమని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.

కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం కారణంగా.. 28 వేల స్మార్ట్ ఫోన్లు, 20 లక్షల సిమ్ కార్డులు బ్యాన్ కి గురి కానున్నాయి. కేంద్రం కొత్తగా రీవెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించమని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.

  • Published May 15, 2024 | 10:06 PMUpdated May 15, 2024 | 10:06 PM
28 వేల ఫోన్లు, 20 లక్షల సిమ్ కార్డులపై బ్యాన్.. ఇలా చేయకపోతే మీకు నష్టం తప్పదు

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 28 వేల మొబైల్ ఫోన్లు, 20 లక్షల సిమ్ కార్డులు నిషేధానికి గురి కానున్నాయి. ఈ క్రమంలో ఎవరైతే రీవెరిఫికేషన్ చేయించుకోరో వారి ఫోన్లు, ఫోన్ నంబర్లు కూడా బ్యాన్ కి గురయ్యే అవకాశం ఉంది. టెలికాం కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ నేరంలో భాగమైన 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని ఆయా టెలికాం కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఇక సిం కార్డులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సంస్థలకు కేంద్రం సూచించింది.

రీవెరిఫికేషన్ చేయని సిమ్ కార్డుల కనెక్షన్ ని తొలగించాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. సైబర్ నేరాలను నియంత్రించాలన్న ఉద్దేశంతో కేంద్ర ఏ నిర్ణయం తీసుకుంది. మొత్తం 28,200 మొబైల్ హ్యాండ్ సెట్స్.. సైబర్ నేరంలో ఇన్వాల్వ్ అయినట్లు ప్రభుత్వం వద్ద డేటా ఉంది. ఆ మొబైల్ హ్యాండ్ సెట్స్ లో 20 లక్షల నంబర్స్ ని వినియోగించినట్లు తెలుస్తోంది. రీవెరిఫికేషన్ తర్వాత ఈ నంబర్స్ పై నిషేధం అమలులోకి వస్తుంది. మొబైల్ ఫోన్లపై కూడా నిషేధం పడనుంది. డిజిటల్ మోసాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియను తీసుకొచ్చింది. ఆన్ లైన్ మోసాల నుంచి భారత పౌరులను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఏ మొబైల్ హ్యాండ్ సెట్స్ అయితే సైబర్ నేరంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాటన్నిటి మీద దేశవ్యాప్తంగా బ్యాన్ విధించాలని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. 20 లక్షల నంబర్స్ కనెక్షన్స్ కి సంబంధించి కూడా రీవెరిఫికేషన్ చేయాలని.. రీవెరిఫికేషన్ ఫెయిల్ అయిన నంబర్స్ ని నిషేధించాలని సూచించింది. సైబర్ క్రైమ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ని అరికట్టేందుకు ప్రభుత్వం రీసెంట్ గా డిజిటల్ ఇంటిలిజెన్స్ ప్లాట్ ఫార్మ్ ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రియల్ టైం ఇంటిలిజెన్స్ షేరింగ్, ఇన్ఫర్మేషన్ ఎక్స్ ఛేంజ్, ఇతర విభాగాల మధ్య కోఆర్డినేషన్ వంటివి ఈ డిజిటల్ ఇంటిలిజెన్స్ ప్లాట్ ఫార్మ్ ద్వారా ఈజీగా జరపచ్చు. టెలికాం కంపెనీలు, సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, లా ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ని జారీ చేసే అథారిటీలు ఇలా పలు రకాల విభాగాలన్నీ ఈ డిజిటల్ ఇంటిలిజెన్స్ ప్లాట్ ఫార్మ్ కింద లింక్ అయి ఉంటాయి. ఇవన్నీ కలిసి పని చేయడం వల్ల సైబర్ సమస్యలను వేగంగా పరిష్కరించే వీలు ఉంటుంది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి