iDreamPost

దాతలు కాస్త ఆలోచించండి

దాతలు కాస్త ఆలోచించండి

దానాలు చేయొద్దని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఆ పాత్ర దానం మాత్రమే చేయవద్దనేదే మా విన్నపం. కరోనా విలయతాండవం అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ లో ఇబ్బందులు పడే జనాన్ని ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. ఇది అభినందించదగ్గ విషయం. నేరుగా దానం చేసేవారు కొందరు అయితే ఏదో ఒక సంస్థ ద్వారా సేవల్లో పాలుపంచుకునే వారు ఇంకొందరు. అందరికీ శతకోటి వందనాలు. మళ్లీ చెబుతున్నా దానం చేయొద్దని చెప్పందం మా ఉద్దేశ్యంకాదు. కానీ ఎవరినీ 3 చదరపు కిలోమీటర్లు దాటి బయటకు వెళ్లవద్దని పోలీసులు ఖచ్చితమైన హెచ్చరికలు జారీ చేసి అమలు చేస్తున్నారు. అంటే ఎంత మంది దాతలు సహాయం చేసిన ఆ మూడు కిలోమీటర్ల పరిధిలోనే అన్నం కోసం ఎదురుచూసే అభాగ్యులకు ఆహార పొట్లాలు అందించాలి. ఒకవేళ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన ఆరు కిలోమీటర్ల పరిధిలో వారు చేయకలుగుతారు.

ఇప్పటికే ప్రభుత్వం రోడ్డు పక్కన ఉన్న వారిని గుర్తించి, వారికి దాతల సహాయంతో తగిన ఏర్పాట్లు కూడా పలు చోట్ల చేసింది. వీరు కాకుండా అన్నం కోసం ఎదురు చూసే వారిలో వలస కూలీలు ప్రధానంగా ఉంటారు. వీళ్లకు పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఆహార పొట్లాలు తయారుచేసి పంపిణీ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ క్రమంలోనే ఆహారం వృధా అవుతుందని పలువురు చెబుతున్న మాట. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా లోని ఒక ప్రముఖ పట్టణ సమీపంలోని ఆశ్రమంలో సుమారు 500 మంది వరకు ఉంటారు. అలాగే ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆశ్రయం పొందుతున్న యువకులు అంతా కలిపితే ఒక వెయ్యి మంది వరకు ఉంటారు. కానీ ప్రతిరోజూ ఆహారం అందించేందుకు ఐదు ఆరు సంస్థలు, వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు.

ఇది ఎలా మారిందంటే నిర్ణీత సమయం లోపు తమ వద్దనున్న ఆహార పొట్లాలు పంపిణీ చేసేందుకు ఒక్కొక్కరికి ఐదు ఆహార పొట్లాలు పంపిణీ చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో ఆ పొట్లాలు పొందిన వ్యక్తి వాటిలో తనకు నచ్చింది ఉంచుకొని మిగిలింది వృధాగా పడేస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం సమయంలో ఆహారం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో మహా అయితే ఇంకో పొట్లం ఉపయోగపడుతుంది. మిగిలినవి చెత్తబుట్టలోకి చేరుతున్నాయి. ఇలా అతిగా తయారు చేసుకుని వచ్చిన ఆహార పదార్థాలు వృధా కావడం చూసిన వాళ్ళు అయ్యో ఇదేంటి అని అనుకుంటున్నారు. గుప్పెడు మెతుకుల కు ఇన్ని మాటలు ఎందుకు అని అంటారా. అయితే మీరు వృధా చేసే ప్రతి ఆహారపదార్థం భవిష్యత్తులో ఉపయోగపడకుండా ఉన్నటట్లే లెక్క.

దానం చేసే వాళ్ళు ఆహార పదార్థాలు సక్రమంగా వినియోపడుతున్నాయా..?లేదా..? అన్నది కూడా పరిశీలించగలిగితే దానం ఇచ్చిన వారి కష్టార్జితం, లక్ష్యానికి విలువలు ఇచ్చిన వారవుతారు. అంతా బాగానే ఉంది. కానీ ఇంత ఖాళీ ఎక్కడ ఎక్కడ ఉంది అంటారా..? అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కి మీరు చేయాలనుకున్న సహాయం జమ చేస్తే అవసరమైనవారికి అది ఖచ్చితంగా చేరుతుంది. దాతలు కాస్త ఆలోచించండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి