iDreamPost
android-app
ios-app

‘లియో’కి విజయ్ కంటే ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా?

  • Author ajaykrishna Updated - 07:33 PM, Mon - 30 October 23

ఇండస్ట్రీలో కొన్నిసార్లు మేకర్స్ రాసుకున్న కథలకు అనుకున్న హీరోలు దొరక్కపోతే.. వేరే హీరోలతో సినిమాలు చేసేస్తుంటారు. ఇప్పుడు ఇదే విషయం లియోకి రిపీట్ అయ్యిందట. లియోకి ముందుగా అనుకున్న హీరో విజయ్ కాదట. ఆ హీరో ఎవరంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

ఇండస్ట్రీలో కొన్నిసార్లు మేకర్స్ రాసుకున్న కథలకు అనుకున్న హీరోలు దొరక్కపోతే.. వేరే హీరోలతో సినిమాలు చేసేస్తుంటారు. ఇప్పుడు ఇదే విషయం లియోకి రిపీట్ అయ్యిందట. లియోకి ముందుగా అనుకున్న హీరో విజయ్ కాదట. ఆ హీరో ఎవరంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

  • Author ajaykrishna Updated - 07:33 PM, Mon - 30 October 23
‘లియో’కి విజయ్ కంటే ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా?

ఇండస్ట్రీలో దర్శకులు కొన్నిసార్లు కథలను హీరోలను దృష్టిలో పెట్టుకొని రాసుకుంటారు. ఇంకొన్నిసార్లు వాళ్ళు రాసుకున్న కథలను ఎవరో ఒక హీరోతో సినిమా తీస్తుంటారు. కానీ.. కొన్నిసార్లు మాత్రం ఊహించని విధంగా కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. ఎందుకంటే.. ముందుగా అనుకున్న హీరోతో వేరే కథ చేయాల్సి వస్తుంది. తాము అనుకున్న కథను ఇంకో హీరోతో చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం లియో సినిమా విషయంలో అలాంటిదే జరిగిందని అంటున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సినిమాలతో LCU సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి.. సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు లోకేష్. అదే LCU కారణంగా రీసెంట్ గా వచ్చిన లియోకి ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది.

దళపతి విజయ్ హీరోగా నటించిన లియో మూవీ.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా త్రిష నటించగా.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, మిస్కిన్ లాంటి స్టార్స్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాని కూడా చిన్న లింక్ తో LCU లో భాగం చేసేసాడు లోకేష్. అంటే.. ఇప్పుడు లియోగా విజయ్ కూడా యూనివర్స్ లో భాగం అయినట్లే. డిల్లీ, రోలెక్స్, విక్రమ్ లతో పాటు లియో ఫైట్ ఎవరితో ఉండబోతుందో చూడాలి. అయితే.. లియో మూవీ గురించి రీసెంట్ గా ప్రమోషన్స్ లో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు లోకేష్.

అలాంటి విషయాలలో ఒకటి.. లియోకి ముందుగా అనుకున్న హీరో ఎవరు.. అవును లియో సినిమాకు ముందుగా విజయ్ ని అనుకోలేదట. లోకేష్ ఈ విషయాన్ని స్వయంగా తమిళ మీడియాకి చెప్పినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్తే.. లియో మూవీ స్టోరీ 5 ఏళ్ళ క్రితం రాసుకున్నాడట లోకేష్. అప్పుడు అనుకున్న హీరో విజయ్ కాదట. మాస్టర్ సినిమా చేసాక విజయ్ నుండి మరింత యాక్షన్ బయట పెట్టేందుకు మళ్ళీ లియో చేశానని చెప్పాడు. అయితే.. తాను ముందుగా అనుకున్న హీరోతో మాత్రం లియో కుదరలేదట. ఇంతకీ విజయ్ కంటే ముందుగా అనుకున్న హీరో ఎవరు? అనంటే.. ఆ ముక్క మాత్రం బయట పెట్టలేదు లోకేష్. కానీ.. కమల్ హాసన్ అని కోలీవుడ్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మరి లియో మూవీ తర్వాత లోకేష్.. తదుపరి సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేస్తున్నాడు. మరి లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.